Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » 7th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

7th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4,362 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అంతే కాకుండా క‌రోనాతో 66 మంది మృతి చెందారు.

Advertisement

నేడు హైద‌రాబాద్ లో భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభం ప్రారంభం అయ్యింది. ఈ స‌మావేశాల‌నికి జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్పీ జీవన్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

Ad

నేడు తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఆర్థిక‌ మంత్రి హరీష్ రావు నేడు అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రిగా హ‌రీష్ రావు మర్యాదపూర్వకంగా కౌన్సిల్ చైర్మన్- స్పీకర్ ను కలిసారు. ఇక‌ అసెంబ్లీలో హరీష్ రావు- కౌన్సిల్ లో వేముల ప్రశాంత్ రెడ్డిలు బ‌డ్జెట్ ను ప్రవేశ‌పెట్టనున్నారు.

 

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల తరలింపు పై ప్ర‌ధాని చ‌ర్చించే అవ‌కాశ‌ముంది.

 

టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర‌వాత‌ మొదటిసారి ఈటల రాజేందర్ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఈట‌ల‌తో అసెంబ్లీ వ‌ద్ద‌కు వెళ్ళడానికి వీలులేదంటూ మేడ్చల్ పోలీసుల ఆంక్షలు విదించారు. ఇక‌ ప్రభుత్వ నియంతృత్వం, పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ ఢిల్లీలో అరెస్ట్ చేసింది.

RTC MD SAJJANAR

RTC MD SAJJANAR

తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా 60ఏళ్లు దాటిన మ‌హిళ‌ల‌కు ఫ్రీగా రేపు ప్ర‌యాణం చేసే అవ‌కాశం కల్పించింది. అంతే కాకుండా మ‌హిళ‌ల‌కు ఉచితంగా డ్రైవింగ్ లో శిక్ష‌ణ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

 

ఉక్రెయిన్ పై యుద్దం కోసం ర‌ష్యా ఇత‌ర దేశాల ఫైట‌ర్ ల‌ను రంగంలోకి దింపుతోంది. చెచెన్య‌, సిరియా దేశాల సైన్యాల‌ను ర‌ష్య త‌మ సైన్యంలో చేర్చుకుంది.

 

చైనాలోని గుజుయా ప్రావిన్స్ లో బొగ్గుగ‌నిలో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 14 మంది మ‌ర‌ణించిన‌ట్టు ప్ర‌క‌టించారు.

Visitors Are Also Reading