కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ త్వరలోనే జరుగనుంది. అయితే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఇవ్వాళ చివరి రోజు కావడం విశేషం. ఇవ్వాళ అమావాస్య కావడం తో నిన్ననే భారీగా నామినేషన్లు ధాఖలు చేశారు అభ్యర్థులు. నిన్న రాత్రి కూడా చివరి జాబితా లో అభర్థులను ప్రకటించింది బీజేపి. ఇది ఇలా ఉండగా.. కర్నాటక ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాన్ ను దింపేందుకు బీజేపి పార్టీ ప్రయత్నిస్తోంది.
READ ALSO : Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…
Advertisement
కర్నాటక లో ఇవ్వాళ సాయంత్రం ముగియనుంది నామినేషన్ల పర్వం. దీంతో రేపటి నుండి ప్రచారం ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో రెండు సార్లు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు కర్ణాటక బీజేపి నేత తేజస్వీ సూర్య. తెలుగు ఓటర్లున్న బాగేపల్లి..చిక్ బళ్లాపూర్, బెంగుళూరు సిటీ, కోలార్ లలో పవన్ కళ్యాణ్ ను ప్రచారానికి ఆహ్వానించాలనే యోచనలో బీజేపి ఉంది.
Advertisement
READ ALSO : ‘హిమాన్షు’ మరో అరుదైన ఘనత… మనవడికి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం…
అయితే బీజేపి స్టార్ కాంపెనైర్ల జాబితాలో తేజస్వీ సూర్య పేరు..మాత్రం లేదు. ప్రస్తుతం బీజేపితో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్… కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదానిపై బీజేపి లో చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల సమయంలో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దించాలని ప్రయత్నిస్తోంది. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
READ ALSO : విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?