రేపటి నుంచి ప్రపంచకప్ కురుక్షేత్రం మొదలవుతుంది. 46 రోజుల పాటు సాగే ఈ మహాసంగ్రామంలో 10 జట్లు అమీతుమీ తేల్చుకొనున్నాయి. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఎంట్రీ మ్యాచ్ తో మొదటి అడుగు పడనుంది. సొంతగడ్డపై ఈ మెగాటోర్నీ జరుగుతుండటంతో మ్యాచ్లను నేరుగా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుండి చూస్తూ మ్యాచ్ మజాను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.
ఇప్పటికే ఫ్యాన్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో హోటల్స్ బుక్ చేసుకున్నారు. వేలాకి వేలు పోగేసి హోటల్స్, లాడ్జ్, హాస్టల్స్ లను బుక్ చేసుకున్నారు. టికెట్స్ దొరకనివారు చుట్టుపక్కల ఎత్తైన బిల్డింగ్స్ లలో రెంటులకి దిగిపోతున్నారు. ఆరంభం మ్యాచ్ ను నేరుగా చూసేందుకు అవసరమైతే లక్షలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇక డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని హోటల్స్ ధరలను భారీగా పెంచుతున్నారు. అటువైపు వెళ్లే ఫ్లైట్ ధరలను డబుల్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
టికెట్స్ దొరికినవారు ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే….టికెట్స్ దక్కించుకోలేని మరికొందరు నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా లేడీస్ కు టికెట్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో లేడీస్ కు 40 వేల టికెట్స్ ను ఫ్రీగా ఆఫర్ చేస్తుంది రూలింగ్ పార్టీ బిజెపి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మొదటి మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించాలనుకుంటుంది. అందులో భాగంగా 40 వేలమంది స్త్రీలకు ఆరంభ మ్యాచ్ టికెట్ లను స్పాన్సర్ చేసింది. మహిళలకు ఫ్రీ టికెట్స్ తో పాటు ఫుడ్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.
ఇవి కూడా చదవండి
- Thalaivar170 : రజినీకాంత్ సినిమాలో విలన్ గా రానా ?
- పవన్ కల్యాణ్ నటికి విడాకులు .. పెళ్లైన ఏడాదికే భర్తకు దూరంగా..?
- ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు – లక్ష్మీపార్వతి