Home » “బింబిసార” ఫస్ట్ కలెక్షన్ల మోత….కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మొదటి సారి….!

“బింబిసార” ఫస్ట్ కలెక్షన్ల మోత….కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మొదటి సారి….!

by AJAY
Ad

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్ షోలతోనే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు మొదటి రోజు రూ.6.30 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. దాంతో కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మొదటిసారి హైయెస్ట్ వసూళ్లు క్రియేట్ చేసిన సినిమాగా బింబిసార నిలిచింది.

Advertisement

Advertisement

కళ్యాణ్ రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇజం సినిమా మొదటిరోజు 3.09 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ మళ్ళీ ఆ రేంజ్ లో వసూళ్ళను రాబట్టుకోలేకపోయాడు. కానీ ఈ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించారు. కేథరిన్ కళ్యాణ్ రామ్ కు జోడిగా నటించింది. ఈ సినిమా పోస్టర్ మగధీర, బాహుబలి రేంజ్ లో ఉన్నప్పటికీ సినిమాపై పెద్దగా అంచనాలు నెలకొనలేదు.

కానీ సినిమా విడుదల అయ్యాక మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. సినిమా కథ విజువల్స్ నటీనటుల పర్ఫామెన్స్ ఇలా అన్ని బాగుండడంతో సినిమా సూపర్ హిట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా ముందు ముందు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.

Visitors Are Also Reading