కాంగ్రెస్ కు జమ్మూ కశ్మీర్ లో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత గలాం నబీ ఆజాద్ సోదరుడి కుమారుడు ముబాషిర్ ఆజాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆదివారం ముబాషిర్ ఆజాద్ బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….తాను బీజేపీ లోకి చేరే విషయం గులాం నబీ ఆజాద్ తో చర్చించలేదని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం గులాం నబీ ఆజాద్ ను అగౌరవపరిచిందని చెప్పారు. అలా అగౌరవ పర్చడం తనకు నచ్చలేదని అన్నారు.
Advertisement
Advertisement
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసిన ఆజాద్ ను ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ లో ప్రశంశిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం పక్కన పెట్టిందని చెప్పారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తనను బీజేపీ వైపు అడుగులు వేసేలా చేశాయని చెప్పారు. మోడీ నాయకత్వంలో ప్రజలకోసం సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తామని చెప్పారు.