Home » viral video : ఆటో డ్రైవ‌ర్ గా మారిన బిగ్ బాస్ విన్న‌ర్…!

viral video : ఆటో డ్రైవ‌ర్ గా మారిన బిగ్ బాస్ విన్న‌ర్…!

by AJAY
Ad

రాహుల్ సిప్లింగ‌జ్ అంటే టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగులో కూడా ఆల్బ‌మ్స్ తీసి హిట్ చేయోచ్చు అని రాహుల్ త‌న మంగ‌మ్మ పాట‌తో నిరూపించాడు. క్లాస్ మాస్ ఏ సాంగ్ అయినా రాహుల్ సిప్లింగ‌జ్ త‌న‌దైన రీతిలో పాడి ఆక‌ట్టుకుంటాడు. ఎన్నో చిత్రాలకు పాట‌లు పాడిన రాహుల్ బెస్ట్ సింగ‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏవైనా స్పెష‌ల్ సాంగ్స్ ఉన్నాయంటే సంగీత ద‌ర్శ‌కులు మొద‌ట రాహుల్ సిప్లింగ‌జ్ నే ఎంచుకుంటారు. ఇక సింగ‌ర్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ బిగ్ బాస్ సీజ‌న్ 3 లోకి ఎంట్రీ ఇచ్చాడు. త‌న యాటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానుల‌ను రాహుల్ సంపాదించుకున్నాడు.

Advertisement

rahul siplingunj

rahul siplingunj

త‌న హైద‌రాబాదీ యాస‌తో హౌస్ ఓ చిల్ గా ఉంటూ చాలా మందికి ఫేవ‌రెట్ కంటెస్టెంట్ గా నిలిచాడు. దాంతో బిగ్ బాస్ సీజ‌న్ 3 టైటిల్ కూడా రాహుల్ కే దక్కింది. ఇదిలా ఉంటే రాహుల్ సిప్లింగ‌జ్ ఇప్పుడు ఆటో డ్రైవ‌ర్ గా మారాడు. అయితే నిజానికి రాహుల్ ఆటో డ్రైవ‌ర్ గా మారిపోయింది కొద్దిసేపు మాత్రమే. ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న రాహుల్ ముంబై రోడ్ల‌పై ఆటో న‌డుపుతూ ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో సేర్ చేశాడు. వీడియోలో ఆటోను ఎంతో ఫాస్ట్ గా న‌డుపుతూ చాలా నైపుణ్యం ఉన్న డ్రైవ‌ర్ లానే న‌డిపించాడు.

Advertisement

also read : 2020లో వివాదాల్లో నిలిచిన బాలీవుడ్ తారలు వీరే…!

ఆ ఆటోలో డ్రైవ‌ర్ కూడా వెన‌కే కూర్చున్నాడు. ఇక ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్ దానికి ముంబై వీధుల్లో చాలా ఎంజాయ్ చేశాను. ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. ఆటోల‌ను న‌డిపే డ్రైవ‌ర్లను నేను ఎంత‌గానో గౌర‌విస్తాను. నా జీవితానికి ఇదే లంభోర్గిని అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. ఇక ప్ర‌స్తుతం రాహుల్ ఆటో న‌డుపుతున్న వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/tv/CXuHFWZKhwe/?utm_source=ig_web_copy_link

Visitors Are Also Reading