Telugu News » Blog » 2020లో వివాదాల్లో నిలిచిన బాలీవుడ్ తారలు వీరే…!

2020లో వివాదాల్లో నిలిచిన బాలీవుడ్ తారలు వీరే…!

by AJAY
Ads

2020 సంవత్సరంలో కొంతమంది సెలబ్రిటీలకు సూపర్ డూపర్ హిట్ లు అందించి వాళ్ళ కెరీర్ నిలబడితే మరి కొందరు సినిమా తారల సినిమాలు అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతో డీలా పడిపోయారు. ఇది ఇలా ఉంటే 2020లో బాలీవుడ్ కు చెందిన చాలామంది సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకున్నారు. అలా వివాదాల్లో చిక్కుకున్న నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఐశ్వర్యరాయ్

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కేసులో ఐశ్వర్య రాయ్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఆరు గంటల పాటు ఐశ్వర్యారాయ్ ని ప్రశ్నించింది. ఫెమా చట్టాన్ని ఉల్లంగించరానే ఆరోపణలతో కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా ఐశ్వర్యరాయ్ ని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఈడీ అభిషేక్ బచ్చన్ మరియు అమితాబ్ లను కూడా ప్రశ్నించింది.

ఆర్యన్ ఖాన్

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడి వివాదాల్లో చిక్కుకున్నాడు. ముంబైలోని క్రూయిజ్ నౌక లో జరిగిన పార్టీలో ఆర్యన్ డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దాంతో జైలు పాలయ్యాడు ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు.

 

అనన్య పాండే

Advertisement

టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో అనన్య పాండే ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అనన్య పాండే కూడా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఆర్యన్ తో చేసిన చాటింగ్ కారణంగా ఎన్సిబి అధికారులు ఆమెను ప్రశ్నించారు.

రాజ్ కుంద్రా

బాలీవుడ్ నిర్మాత, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్టయ్యారు. పోర్న్ వీడియోల కేసులో పోలీసులు ఆధారాలు సేకరించడంతో రాజ్ కుంద్రా రెండు నెలలు జైలులో గడిపాడు. సెప్టెంబర్ లో రాజ్ కుంద్రా కు బెయిల్ వచ్చింది.

కంగనా రనౌత్

కంగనా రనౌత్ ఏడాది తో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటుంది. ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పై ఆరోపణలు చేయడం.. సుశాంత్ మరణం తరవాత బాలీవుడ్ లోని పలువురు నటీనటులు పై ఆరోపణలు చేయడం ద్వారా కంగనారనౌత్ వివాదాల్లో నిలిచింది.

జాక్వలిన్ ఫెర్నాండెజ్

బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ కూడా ఈ ఏడాది వివాదాల్లో చిక్కుకుంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులో జాక్వలిన్ కూడా విచారణ ఎదుర్కొంది. దాదాపుగా 10 కోట్ల బహుమతులను సుకేష్ వద్ద నుండి తీసుకున్నట్టు జాక్వెలిన్ పై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ పలుమార్లు జాక్వెలిన్ ను ప్రశ్నించింది.

Advertisement

also read : ముంబై లో చెక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కిన హిట్ పెయిర్..!