Home » మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్న క‌రాటే క‌ళ్యాణి ?

మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్న క‌రాటే క‌ళ్యాణి ?

by Bunty
Ad

నటి కరాటే కళ్యాణి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కామెడీ రోల్స్, నాటి రోల్స్ తో కరాటే కళ్యాణి ప్రేక్షకులను మెప్పించింది. రవితేజ మిరపకాయ్ సినిమాలో “అబ్బ” కరాటే కళ్యాణి చెప్పిన డైలాగ్… కడుపుబ్బ నవ్విస్తుంది. కృష్ణ, అ.. ఆ, నేను లోకల్ లాంటి చిత్రాలలో కరాటే కళ్యాణి నటించింది. కరాటే కళ్యాణి టాలీవుడ్ కార్యక్రమాలలో మరియు అసోసియేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. ప్రస్తుతం చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ జీవనం గడిపేస్తోంది కరాటే కళ్యాణి.

Advertisement

Advertisement

అయితే.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి తన పెళ్లి విషయం పై ప్రస్తావించింది. మళ్లీ పెళ్లి చేసుకుంటారా ? అని యూట్యూబ్ యాంకర్ అడిగిన ప్రశ్నకు కరాటే కళ్యాణి షాకింగ్ సమాధానాలు చెప్పింది. “తనకు గతంలో పెళ్లి జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల తాము విడిపోయారు. నాకు దేవుడిచ్చిన ఒక బిడ్డ ఉన్నాడు. ఎవరైనా బాగా నచ్చితే పెళ్లి చేసుకుంటాను. మీరే సంబంధాలు చూడండి. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. మీరే నా పెళ్లి చేస్తే ఇంకా సంతోషిస్తాను. నాలాంటి గయ్యాల దాన్ని ఎవరు చేసుకుంటారు ” అంటూ ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చింది కరాటే కళ్యాణి.

Visitors Are Also Reading