Telugu News » Blog » BIGG BOSS OTT : బిగ్ బాస్ ఓటిటిలోకి ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్..భార్య‌తో స‌హా ఎంట్రీ…!

BIGG BOSS OTT : బిగ్ బాస్ ఓటిటిలోకి ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్..భార్య‌తో స‌హా ఎంట్రీ…!

by AJAY
Ads

తెలుగు లో అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయిన వెంటనే బిగ్ బాస్ ఓటీటీ సీజ‌న్ 6 ను కూడా ప్రకటించేశారు. బిగ్ బాస్ సీజ‌న్ 6 కు కూడా నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా 24 గంటల పాటు బిగ్ బాస్ ఓటీటీని ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా బిగ్ బాస్ ఓటీటీని హాట్ స్టార్ లో ప్ర‌సారం చేయ‌నున్నారు.

Advertisement

bigg boss telugu 6

bigg boss telugu 6

దాంతో బిగ్ బాస్ సీజ‌న్ 6 లోకి ఎంట్రీ ఇవ్వ‌బోయే కంటెస్టెంట్ ల పై సోషల్ మీడియాలో జోరుగా చ‌ర్చ‌ జరుగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఓటిటిలోకి టిక్ టాక్ దుర్గారావు వ‌స్తార‌ని తెలుస్తోంది. అదేవిధంగా ఢీ షో విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

RAGHU MASTER PRANAVI

RAGHU MASTER PRANAVI

అదేవిధంగా రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్- 5 లో సందడి చేసిన సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా బిగ్ బాస్ ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఓటిటి బిగ్ బాస్ లోకి వచ్చే మరో సెలబ్రిటీ పేరు లీక్ అయ్యింది. టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వ రఘు మాస్టర్ ఓటిటి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

RAGHU MASTER PRANAVI

రఘు మాస్టర్ తో పాటు అతని భార్య సింగర్ ప్రణవి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నార‌ని సమాచారం. నిజానికి బిగ్ బాస్ సీజన్ 5 లోనే ఈ జంట ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు… అయితే ఇప్పుడు రఘు మాస్టర్ ఎంట్రీ పక్కా అని ఇప్పటికే అగ్రిమెంట్ పై కూడా సంతకం చేశారని సమాచారం. మరి రఘు మాస్టర్ బిగ్ బాస్ షోకి వస్తాడా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.