Home » బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. ఎలాంటి డౌట్ లేదు..?

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. ఎలాంటి డౌట్ లేదు..?

by Anji
Ad

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 7 పై గత సీజన్లతో పోల్చి చూస్తే అంచనాలు పెరగగా ఈ సీజన్ ఆ అంచనాలను అందుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిందనే విషయం తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే ప్రశ్నకు రకరకాలుగా సమాధానాలు వినిపిస్తుండగా.. బిగ్ బాస్ షో సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ విషయంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

ఈవారం శోభాశెట్టి ఎలిమినేట్ కానుండగా వచ్చేవారం మిడ్ వీక్ లో యావర్  ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. టాప్ 1 కాంటెస్ట్ గా పల్లవి ప్రశాంత్,  టాప్ 2గా అర్జున్,  టాప్ 3 లలో శివాజీ టాప్ 4 అమర్ దీప్, టాప్ 5లో ప్రియాంక ఉండే ఛాన్స్ అయితే ఉంది. హోస్ట్ గా నాగార్జునకు సైతం ఈ షో మంచి పేరును తెచ్చిపెట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ షో ఎంతగానో మెప్పిస్తుండటం గమనార్హం.  బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిస్తే మాత్రం అది చరిత్ర అవుతుందని చెప్పవచ్చు.

Advertisement

 


రైతు బిడ్డగా బిగ్ బాస్ షోకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించిన తీరు సైతం అతనికి ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ షో ద్వారా పల్లవి ప్రశాంత కెరీర్ పరంగా అంతకంతకు ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని ప్రచారం జరుగుతుండగా, ఆ ప్రచారంలో నిజ నిజాలు తెలియాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Visitors Are Also Reading