Home » బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కొత్త కారు..ఎన్ని లక్షలంటే..?

బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కొత్త కారు..ఎన్ని లక్షలంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కోటి విద్యలు కూటి కోసమే అంటారు పెద్దలు. కానీ ప్రస్తుత కాలంలో కూడుతోపాటు గూడు అనే ఆప్షన్ కూడా వచ్చిందని చెప్పవచ్చు. గూడుతోపాటు కారు కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అలా చాలామంది ఎంతో కష్టపడి ఇల్లు కారు కొనుక్కుంటూ వారి కలలను నెరవేర్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే కూడా తన కల నెరవేర్చుకున్నాడు. రంజాన్ సందర్భంగా కొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేసి, కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు.

also read:ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు మూవీ..!

Advertisement

టిక్ టాక్ వీడియోలు, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ 4 సీజన్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఈ సీజన్లో గ్రాండ్ ఫినాలే వేదికగా చిరంజీవి చేతుల మీదుగా పది లక్షల రూపాయలు అందుకున్నారు. ఆ డబ్బును తాను సంపాదించిన డబ్బు కలిపి గుంటూరులో సొంత ఇల్లు కట్టుకున్నారు. మరి ఇల్లు అన్నాక పార్కింగ్లో కారు లేకపోతే అందం ఉండదు కదా.

also read:కాలికి నల్ల దారం కట్టేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరి పాటించాలి..లేదంటే నష్టమే..?

అలా ఒక్కొక్క పైసా కూడాబెట్టి రంజాన్ సందర్భంగా రూ. 15 లక్షలు పెట్టి మహీంద్రా ఎక్స్ యు వి 700 కారును కొనుగోలు చేశాడు. నలుపు రంగులో ఉన్న ఈ కారు ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. రంజాన్ శుభ సందర్భంగా ఈ కారుకు ప్రత్యేక పూజలు చేయించుకొని ఆశీర్వాదాలు ఇవ్వమని సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:భార్యాభర్తలు ఆ ఒక్క కార్యం చేయకపోతే..5 అనర్ధాలు తప్పవు..!!

Visitors Are Also Reading