Telugu News » Blog » దళితుల పై అభ్యంతకర వ్యాఖ్యలు…బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్….!

దళితుల పై అభ్యంతకర వ్యాఖ్యలు…బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్….!

by AJAY
Ads

తమిళ బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్ ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు మీరా మిథున్ ను కేరళలో అరెస్టు చేసినట్టు సమాచారం. గతంలో మీరా మిథున్ దళితులపై అభ్యంతర వ్యాఖ్యలు చేసి దుమారం రేపింది. దాంతో ఆమె చిక్కుల్లో పడింది. ఇండస్ట్రీకి సంబంధించిన దళిత నటులు, డైరెక్టర్ల పై మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్రమ కార్యకలాపాల నేరాల్లో పాల్గొంటారు కాబట్టే దళితులు సమస్యలను ఎదుర్కొంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కారణం లేకుండా ఎవరూ ఎవరినీ ఏమీ అనరు అంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి దళితులు…. డైరెక్టర్లను ఇండస్ట్రీ నుండి తరిమేయాలని ఆరోపించింది.

Ads
Ads

ఈ నేపథ్యంలోనే గత ఏడాది డిసెంబర్ లో మీరా మిథున్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. కొన్ని విచారణల‌కు హాజరైన మీరా మిథున్ ఆ తర్వాత విచారణలకు డుమ్మా కొట్టింది. దాంతో ఎగ్మురు లోని కోర్టు మీరా మిథున్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. దాంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే పోలీసులు బిగ్ బాస్ బ్యూటీని అరెస్ట్ చేశారు.