Home » గాడ్‌ఫాద‌ర్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. మాట నిల‌బెట్టుకున్న మెగాస్టార్‌..!

గాడ్‌ఫాద‌ర్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. మాట నిల‌బెట్టుకున్న మెగాస్టార్‌..!

by Anji
Ad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా కాంబోలో తెర‌కెక్కిత‌న తాజా చిత్రం గాడ్‌ఫాద‌ర్‌. ఈ సినిమా పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందించిన విష‌యం విదిత‌మే. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, సత్య‌దేవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Advertisement

ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకోవ‌డ‌మే కాకుండా ఈయ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఒక స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ ఎంతో ఒదిగే ఉంటారు. లైట్‌మెన్ నుంచి ఒక‌స్టార్ హీరో, హీరోయిన్ వ‌ర‌కు మెగాస్టార్ అంతే గౌర‌వ మ‌ర్యాద‌లు ఇస్తూ మాట్లాడుతుంటారు. చిరంజీవి ఒక్క‌సారి మాట ఇచ్చారంటే ఆ మాట నిల‌బెట్టుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకోరు. ఒక్క‌సారి మెగాస్టార్ మాట ఇచ్చారంటే ఆ మాట‌పై నిల‌బ‌డ‌తార‌ని ఇదివ‌ర‌కు ఎన్నో సార్లు నిరూపించారు. చిరంజీవి ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డుతార‌ని తాజాగా మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు. అప్పుడేప్పుడో బిగ్ బాస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసినటువంటి కంటెస్టెంట్ దివికి ఒక మాట ఇచ్చారు.భవిష్యత్తులో తన సినిమాలో తప్పకుండా దివికి అవకాశం కల్పిస్తానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆ మాట‌ను గాడ్‌ఫాద‌ర్ సినిమా నెర‌వేర్చారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బిగ్‌బాస్ బ్యూటీ దివి మెరిసింది.

Advertisement

Also Read :  జానీ సినిమాపై జ‌రిగిన ప్ర‌యోగాల గురించి తెలుసా ?

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఆశ్ర‌మంలో పెరిగిన దివి ఒక రోజు ఆశ్రమం నుంచి వెళ్లిపోతున్నాన‌ని బ‌య‌టికి వెళ్తోంది. బ‌య‌టికి వెళ్లి ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చి నా బిడ్డ‌కు త‌ల్లి బ్ర‌హ్మ (చిరంజీవి) అని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఆమె వాస్త‌వానికి సునీల్ భార్య రేణుక పాత్ర‌లో క‌నిపించింది దివి. ఈ చిత్రంలో కొన్ని ఊహించని సీన్స్‌లో న‌టించింది. బిగ్‌బాస్ సీజ‌న్‌-4లో పాల్గొన్న దివి ఫెర్మామెన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. విజేత‌గా నిల‌వ‌క‌పోయినా త‌న అందం, ప్ర‌వ‌ర్త‌నతో ప‌లువురి మ‌న‌సులు గెల్చుకుంది. ఆ సీజ‌న్ ఫినాలేకి చీఫ్‌గెస్ట్‌గా హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి సైతం దివినీ చూసి మెస్మ‌రైజ్ అయ్యారు. అప్పుడే బిగ్‌బాస్ వేదిక‌పైనే మాట ఇచ్చారు. తాజాగా ఆ మాట‌ను గాడ్‌ఫాద‌ర్‌తో నెర‌వేర్చుకున్నారు. తొలుత భోళాశంక‌ర్ సినిమాలో ఆమెకు పోలీస్ అధికారి పాత్ర ఇచ్చిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. అనూహ్యంగా గాడ్‌ఫాద‌ర్ సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరించింది దివి.

Also Read :  భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని అవమానాలు NTR పడ్డారంటే ?

 

Visitors Are Also Reading