Home » BIGG BOSS -5 : హాస్పిట‌ల్ కు వీజే స‌న్నీ…అసలేం జ‌రిగింది..?

BIGG BOSS -5 : హాస్పిట‌ల్ కు వీజే స‌న్నీ…అసలేం జ‌రిగింది..?

by AJAY
Ad

బిగ్ బాస్ హౌస్ లో చివ‌రి నామినేషన్ లు పూర్త‌య్యాయి. ఇక ఇప్ప‌టికే శ్రీరామ్ ఫైన‌లిస్ట్ ల లిస్ట్ లో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. దాంతో స‌న్నీ, మాస‌న్, సిరి,కాజ‌ల్,ష‌ణ్ముక్ లు నామినేష‌న్ లిస్ట్ లో ఉన్నారు. నామినేష‌న్ లు పూర్త‌యిన త‌ర‌వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ ల‌కు కొన్ని ఫ‌న్నీ టాస్క్ లు ఇచ్చాడు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ గులాబ్ జామూన్ లు తినే టాస్క్ ను కూడా ఇచ్చాడు. ఈ గేమ్ లో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ గులాబ్ జామూన్ లు ఎవ‌రు తింటే వారే విన్న‌ర్ గా నిలుస్తారు. అయితే టాస్క్ లో మొత్తం ప‌దిహేను గులాబ్ జామూన్ లు తిని సిరి హ‌న్మంతు విన్న‌ర్ గా నిలిచింది. కాగా టాస్క్ లో స‌న్నీ గ‌బ‌గ‌బా గులాబ్ జామ్ లు తినే క్ర‌మంలో వామ్తింగ్ లు అయ్యాయి.

Advertisement

illness for bigg boss sunny

illness for bigg boss sunny

మొద‌ట గులాబ్ జామూన్ తిన‌టం వ‌ల్ల‌నే వాంతులు అయ్యాయ‌ని లైట్ తీసుకున్నాడు. అయితే ఆ త‌ర‌వాత మ‌ళ్లీ స‌న్నీకి వాంతులు మొద‌ల‌య్యాయి. దాంతో ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశారు. స‌న్నీ మ‌ళ్లీ వాంతి చేసుకున్నాడ‌ని బిగ్ బాస్ కు చెప్ప‌డంతో వెంట‌నే స‌న్నిని మెడిక‌ల్ రూమ్ కు పిలిపించారు. దాంతో స‌న్నీ అభిమానులు మ‌రియు బిగ్ బాస్ ప్రేక్ష‌కులు అంతా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స‌న్నీకి ఏమ‌యిందా అని ఆదేద‌న వ్య‌క్తం చేశారు. కాగా స‌న్నీ ఆరోగ్యం ప్ర‌స్తుతం భాగానే ఉంద‌ని ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని బిగ్ బాస్ చెప్పారు.

Advertisement

ALSO READ : ‘అఖండ’ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

అంతే కాకుండా సన్నీ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ టాస్కుల్లో బిజీ అవుతారిన చెప్ప‌డంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండ‌గా స‌న్నీ బిగ్ బాస్ విన్న‌ర్ ల రేసులో ఒక‌టి గా ఉన్నారు. ఈ సీజ‌న్ లో సింగ‌ర్ శ్రీరామ్, స‌న్నీ, ష‌ణ్ముక్ జష్వంత్ లకు ఎక్కువ ఫాలోయింగ్ వ‌చ్చింది. దాంతో విన్న‌ర్ ఈ ముగ్గురిలో ఒక‌రంటూ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. ఇక వీరంద‌రిలో కూడా స‌న్నీకి ఎక్కువ ఫాలోయింగ్ వ‌చ్చిందంటూ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading