ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ అయి మొదటి వారం పూర్తి చేసుకొని రెండవ వారం కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. కానీ మొదటి వారంలో ఎలిమినేషన్ ఉంటుందని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఎలిమినేషన్ జరగలేదు. కానీ కంటెస్టెంట్ లు మాత్రం చాలా వాడివేడిగా మూడు నవ్వులు, 6 ఏడుపులు, ఎనిమిది కోపాలు అనే విధంగా పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. ఇలాంటి రియాలిటీ షోలలో ఇప్పటికే అనేకమంది కంటెస్టెంట్ ల బ్యాక్గ్రౌండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తరుణంలో ఆర్ జె సూర్య గురించి కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అతను ఎవరు అతని జీవితంలో ఉన్న రెండు విషాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. హౌస్ లో కంటెస్టెంట్ ఆర్ జె సూర్య అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు.
Advertisement
also read:కోట శ్రీనివాసరావు పరిస్థితి మరీ దారుణం..అవకాశం ఇవ్వండి అంటూ ఎన్టీఆర్, మహేష్ బాబులను అడిగారట..!!
Advertisement
హౌస్ లోకి తను కొంచెం మాస్ లెవల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ముందే అందరి హీరోల వాయిస్ మిమిక్రీ చేస్తున్నాడు. ఈ విధంగా తన టాలెంట్ తో అందరి దృష్టిలో పడ్డారు. సూర్య గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. సూర్య అసలు పేరు సూర్య నారాయణ.. రేడియో జాకీగా తన కెరీర్ మొదలు పెట్టాడు. దీని తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత యాంకర్ గా మారిపోయాడు. ఈయనది ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి పశువుల లంక జన్మస్థలం. 1991 ఏప్రిల్ 1న పుట్టాడు.. తర్వాత వీళ్ల కుటుంబం పశ్చిమగోదావరికి వలస వచ్చింది. సూర్య కుటుంబంలో వినోదాలే కాకుండా అనేక విషాదాలు కూడా ఉన్నాయి. తన తమ్ముడికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది.
ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులేక మరణించాడు. ఇది అతను ఫ్యామిలీలో పెద్ద విషాదం గా చెప్పుకోవాలి. దీనివల్ల ఆర్ జె సూర్య కొద్ది రోజుల వరకు డిప్రెషన్ లోకి వెళ్లారట. అలాగే ఆయన విద్యాభ్యాసం విషయం వస్తే భీమవరంలో csn కాలేజీలో బీకాం పూర్తి చేసి, ఆ తర్వాత ఎం కామ్ కోసం ప్రభుత్వ కళాశాలలో చేరాడు.. అక్కడ ఒక అమ్మాయి తో లవ్ లో పడడం అది బ్రేకప్ అవ్వడంతో ఎం కామ్ మధ్యలోనే వదిలేసడట సూర్య. అప్పుడు కూడా చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్లారని సమాచారం. ఈ విధంగా అతను జీవితంలో రెండు అనుకోని సంఘటనలు విపరీతంగా బాధపెట్టాయని అతని గురించి తెలిసినవారు సన్నిహితులు తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.
also read:అబ్బాయిల్లో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే 5 లక్షణాలు ఇవేనట….? 3 వది ఇంపార్టెంట్…!