ప్రజలకు ఉపయోగపడే సినిమాలు, భారత దేశ చరిత్రను తెలిపే సినిమా లకు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తాయి. రీసెంట్ గా వచ్చిన కాశ్మీరీ ఫైల్స్ సినిమా కు కూడా బిజెపి పాలిత రాష్ట్రాలు ట్యాక్స్ లో రాయితీ ఇచ్చాయి. ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడాలి అనేది దాని వెనక ఉన్న ఉద్దేశ్యం. అలా జరగాలి అంటే ఆయా సినిమాల టికెట్ ధరలను తగ్గించాలి.
ఇవి కూడా చదవండి: ఇద్దరు పిల్లలను వదిలి స్టూడెంట్ తో పారిపోయిన భార్య…భర్త అలా చేయడం తో మైండ్ బ్లాక్….!
అయితే రాయితీ పొందిన కొన్ని సినిమాలు అలా టికెట్ ధరలను తగ్గించి తమ సినిమా ప్రేక్షకులు చూసే విధంగా చేశాయి. ఇదిలా ఉంటే ట్యాక్స్ లో రాయితీ ఇచ్చినా కూడా టికెట్ ధరను తగ్గించని సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలకు తాజాగా సుప్రీం కోర్టు జలక్ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వం లో బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయం సాధించింది.
Advertisement
Advertisement
ఇవి కూడా చదవండి:విక్రమ్ “కోబ్రా” సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?
ఈ సినిమా లో శాతకర్ణి గురించి గొప్పగా చూపించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా అందరికీ చేరాలి అనే ఉద్దేశం తో రాయితీ ఇచ్చారు. కానీ చిత్ర యూనిట్ టికెట్ ధరలను మాత్రం తగ్గించలేదు. చిత్ర యూనిట్ చేసిన తప్పుకు ఇప్పుడు సుప్రీం కోర్టు హీరో బాలయ్య తో పాటు సినిమా నిర్మాతలకు నోటీసులు అందజేసింది.
అదే విధంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమా విషయం లో కూడా అదే జరిగింది. రుధమదేవి సినిమా కాకతీయుల చరిత్ర….ఈ సినిమా కు కూడా రాయితీ ఇచ్చారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం టికెట్ ధరలను తగ్గించలేదు. దాంతో ఈ సినిమా నిర్మాతలు కూడా సుప్రీం ధర్మాసనం నుండి నోటీసులు అందుకున్నారు.
ఇవి కూడా చదవండి: ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న భక్త ప్రహ్లాద రిలీజ్ డేట్.. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే..?