Home » విక్రమ్ “కోబ్రా” సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

విక్రమ్ “కోబ్రా” సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్రమ్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన తనదైన నటనతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాలు అంటే ఏదో ఒక వెరైటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది.. ఆయన మూవీస్ చాలా వరకు సక్సెస్ సాధించినవే వున్నాయి.

Advertisement

అయితే ఈ మధ్యకాలంలో విక్రమ్ సినిమాలు కాస్త సక్సెస్ కు దూరంగా వెళుతుండడంతో ఆయన సినీ కెరీర్ ఒడిదుడుకుల్లో పడిందట.. తాజాగా ఆయన నటించిన కోబ్రా మూవీని ఆర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని కూడా విక్రమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రముఖ క్రిటిక్స్ లలో ఒకరైనటువంటి ఉమర్ సంధు తాజాగా ఈ మూవీకి సంబంధించిన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

also read:అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పిన సింగ‌ర్ సునీత‌.. అది వింటే సంతోష‌ప‌డ‌డం ప‌క్కా..!

Advertisement

ఈ సందర్భంగా ఆయన కోబ్రా సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. విక్రమ్ సినిమా నుంచి అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ ఈ మూవీలో ఉన్నాయని యూనిట్ చెబుతోంది. విక్రమ్ నటన, యాక్షన్ సన్నివేశాలు, ఇతర సీన్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే విక్రమ్ ఈ సినిమాలో 9 నుంచి 10 గెటప్ లలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి నటించగా, అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

ఉమర్ సంధు తన రివ్యూలో ఈ మూవీ యూనిక్ కాన్సెప్టుతో నిర్మించారని, డైరెక్షన్ చాలా టెర్రిఫిక్ గా ఉందని తెలియజేశారు. క్లైమాక్స్, ప్రొడక్షన్,డిజైన్ చాలా అద్భుతంగా మలిచారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమాకు ఆయన3.5 రేటింగ్ ను ఇచ్చారు.. మల్టీప్లెక్స్ లో చూసే వారికి ఈ సినిమా ఒక పండగలా ఉంటుందని ఆయన కామెంట్ చేశారు.. ఈ విధంగా ఉమర్ సంధు తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో ఈ సినిమాపై అభిమానులకు మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.. దీంతో నైనా విక్రమ్ కు అనుకున్నంత సక్సెస్ వస్తుందో లేదో, సినిమా ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచి చూడాలి.

also read:ప్ర‌ముఖ న‌టుడు అజ‌య్ ఘోష్ ఒక్క రోజుకి పారితోషికం ఎంత తీసుకుంటాడో తెలుసా..?

Visitors Are Also Reading