Home » సలార్ సినిమాకు పెద్ద షాక్.. అక్కడ లోకల్ సినిమా వల్లే…!

సలార్ సినిమాకు పెద్ద షాక్.. అక్కడ లోకల్ సినిమా వల్లే…!

by Sravya
Ad

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. బాహుబలి సినిమా తర్వాత ఇంత హిట్ ప్రభాస్ కి లభించలేదు. బాహుబలి తర్వాత పెద్ద హిట్ లభించిన సినిమా ఇదే. ప్రశాంత్ నీల్ అద్భుతంగా ఈ సినిమాని తెరమీదకి తీసుకువచ్చారు. కానీ క్రమంగా కలెక్షన్లు తగ్గుతున్నాయి పది రోజుల్లో ఈ సినిమా 600 కోట్లని కలెక్ట్ చేసింది. కానీ ఇంకా చాలా చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు ఓవర్సీస్ లో లాభాలు సాగుతున్నా, ఇండియాలో మాత్రం అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కి దూరంగానే ఉంది.

Advertisement

100 కోట్లకు పైగా గ్రాస్ సాధించే అవకాశముంది కొన్నిచోట్ల మాత్రం ఈ సినిమా ని కొన్ని బయ్యరులకి నష్టం అయితే తప్పట్లేదు. తమిళంలో నష్టాలు తప్పవు అలానే కేరళలో కూడా ఈ సినిమా నష్టాన్ని తీసుకొచ్చేలానే వుంది. నైజం లోను బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. ఏపీలో కాస్త పరవాలేదు. కర్ణాటకలో ఇప్పటికే డ్రాప్ అయ్యింది. హోంబాలే ఫిలిం సొంతంగా రిలీజ్ చేసిన నేపథ్యంలో వాళ్లకి సొంత రాష్ట్రంలో నష్టాలు తప్పేలా లేదు సినిమాకి ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలింది.

Advertisement

prabhas-salaar

లోకల్ సినిమా గట్టి దెబ్బ కొట్టేసింది. కన్నడలో సలార్ పది రోజుల్లో 35 కోట్ల వసూలు చేస్తే స్థానిక సినిమా రెండు రోజుల్లో మార్క్ ని దాటింది అక్కడ ఈ శుక్రవారం దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా రిలీజ్ అయింది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా రస్టిక్ కంటెంట్ తో సినిమా వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే 37 కోట్లను వసూలు చేసింది. కన్నడలో ఇంతగా సినిమా పడిపోవడానికి కారణం అక్కడ ఉగ్రం సినిమాని ఇదివరకే రిలీజ్ చేశారు. ఉగ్రం సినిమాకి ఎక్స్టెన్షన్ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్నారు. సో మూవీ ని చూడడానికి ఆడియన్స్ ఎవరూ కూడా ఇష్టపడట్లేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading