ఒడిస్సా మాజీ సీఎం 9 సార్లు కాంగ్రెస్ ఎంపీ గా ఉన్న సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ లో కలిసిపోతున్నారు. ఆయనతో పాటుగా ఆయన భార్య హేమ గమాంగ్ కొడుకు శిశిర గమాంగ్, మాజీ ఎంపీ సంజయ్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఢిల్లీలో పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహారాలు ఇన్చార్జి అజయ్ కుమార్ తో చర్యలు పూర్తి చేశారట. ఇలా ఒకేసారి వీళ్ళ నలుగురు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు.
Advertisement
Advertisement
కాంగ్రెస్లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కొనసాగి 2015లో బిజెపిలో చేరి గత ఏడాది జనవరి 25న రిజైన్ చేసి బిఆర్ఎస్ లో చేరారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటున్నారు, గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న వీళ్ళ కుటుంబం మరో నాలుగు నెలలు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ లో చేరిపోయింది. బిఆర్ఎస్ లో చేరి ఏడాది పూర్తవ్వకుండానే వీళ్ళు పార్టీని విడిచిపెట్టి వెళ్ళి పోతున్నారు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయిపోయింది/ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!