బిగ్ బాస్ బుల్లితెర రియాలిటీ షోలలో ఎంతో పాపులర్ షోగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తిచేసుకుని ఆరో సీజన్ కూడా పూర్తి అయ్యే సమయం దగ్గరికి వచ్చింది.. ఈసారి బిగ్ బాస్ స్టార్టింగ్ లో కాస్త బోరింగ్ అనిపించినా మూడు వారాలు గడిచేసరికి అనుకోని ఎలిమినేషన్ల వల్ల చాలా ఆసక్తికరంగా తయారైంది.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అంచనాకు అందని విషయంగా మారింది. దీంతో ఈ షోపై భారీగా అంచనాలు పెరిగాయి.. ఈ తరుణంలోనే 14వ వారం కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఇనయా ఎలిమినేట్ అయింది.. మరి ఇనయా బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read;Vishnu priya: అవకాశాల కోసం అలాంటి పని చేసిన తప్పులేదు.. యాంకర్ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్..!!
Advertisement
బిగ్ బాస్ లో అవకాశం రావడం నా జీవితంలో ఒక గొప్ప వరమని చెప్పుకొచ్చింది.. ఇన్ని వారాలు నేను ఉన్నాను అంటే అదంతా నా అభిమానుల పుణ్యమని వారందరికీ రుణపడి ఉంటానని తెలియజేసింది. దీంతో ఆమెను కొంతమంది విలేకరులు ప్రశ్నించారు.. హౌస్ లో టాప్ 2 కంటెస్టెంట్ గా మీరే ఉన్నారు, మీరు ఎలిమినేషన్ అయ్యారు అంటే నమ్ముతున్నారా అని అడిగితే.. అదంతా ఓటింగ్ పై ఆధారపడి ఉందని, నా ఎలిమినేషన్ ను నేను నమ్మడం లేదని, నేను ఎలిమినేషన్ కాను అనుకున్నానని తెలియజేసింది.. సాధారణంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న లేడీ కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఇనయా అని చెప్పుకోవచ్చు..
గేమ్ పరంగా కానీ, టాస్కుల పరంగా కానీ, హౌస్ లో ఉన్నటువంటి కీర్తి భట్ మరియు శ్రీసత్య కంటే ఇనయా పర్ఫామెన్స్ బాగుండేది.. కానీ అనుకోకుండా ఈమె ఎలిమినేషన్ కావడం అభిమానులందరిని ఆశ్చర్యపరుస్తోంది.. టాప్ పొజిషన్ లో ఉన్న రేవంత్ కి హౌస్ లో సరైన పోటీ ఇచ్చింది ఇనయా మాత్రమే అని చెప్పవచ్చు.. అలాంటి ఇనయా టాప్ 2 కంటెస్టెంట్లలో ఉండకుండా ఇలా అనుకోకుండా ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులంతా బిగ్ బాస్ యాజమాన్యం ఆమెపై కుట్ర చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఇనయా ఎలిమినేషన్ మీరు సమర్థిస్తున్నారా..? లేదా..? అనేది కామెంట్ చేయండి..