బిగ్బాస్ సీజన్ 6 ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతోంది. ఎలిమినేషన్లలో మాత్రం అనుకోని విధంగా ట్విస్ట్ ల మీద ట్రిస్టులు ఇస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోని ఏ కంటెస్టెంట్ నైనా ఉపేక్షించేది లేదంటూ చెప్పకనే చెబుతున్నారు బిగ్ బాస్ యూనిట్. ఇక 11వ వారం మెరీనా ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. గత రెండు మూడు వారాల క్రితం ఆమె బలమైన కంటెస్టెంట్ గా ఇంట్లో ఉన్నారు. కానీ ఇంత సడన్ గా ఆమె వెళ్లిపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం..
Advertisement
also read:అమెరికాలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం.. ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు టాస్కుల విషయంలో కూడా చాలా సైలెంట్ గా ఉంటూ, ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేదు. ఎప్పుడు కూడా కూల్ గా ఉండేందుకే ప్రయత్నాలు చేసింది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్లు కూడా ఆమెతో పాజిటివ్ గానే ఉన్నారు. ఇక చివరి వారం మాత్రం మిగతా కంటెస్టెంట్లతో పోటీ పడలేక పోయింది. కానీ మెరీనా 11 వారాలు హౌస్ లో ఉంటుందని ఎవరూ కూడా ఊహించలేదు ఎందుకంటే తన భర్తతో కూడా కలిసి వచ్చింది కాబట్టి.
Advertisement
ఈ తరుణంలోనే బిగ్ బాస్ వీరిద్దరిని విడగొట్టి ఎవరి ఆట వారిదే అనే విధంగా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆమె ఎంత సంపాదించిందనేది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే మెరీనా వారానికి 35000 చొప్పున పారితోషకం తీసుకుందట.. ఈ లెక్క ప్రకారం 11 వారాలకు 3,80000 వచ్చాయన్నమాట. ఇది తన కెరియర్ లోనే మొదటిసారి హై రేంజ్ లో అందుకున్న జీతమట. ఈ విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చిన మెరీనా ఎంతో క్రేజ్ అందుకుంది. ఇక రానున్న రోజుల్లో ఈ క్రేజ్ ఆమెకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.
also read: