Bichagadu 2 Review in Telugu : విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో అతడు నటించిన సరికొత్త చిత్రం బిచ్చగాడు 2. 2016 లో విడుదలైన బిచ్చగాడుకు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. బిచ్చగాడు 2 సీక్వెల్ ను తోలుతభారం, మెట్రోలాంటి సూపర్ హిట్టు అందించిన ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా… అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై అతడే నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు.
కథ మరియు వివరణ
Advertisement
బిచ్చగాడు 2 మూవీ కథ విషయానికి వస్తే… విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) దేశంలో రిచెస్ట్ మ్యాన్ అని పేరు. లక్ష కోట్లకి వారసుడు అయిన విజయ్ గురుమూర్తి మీద చాలా మంది కళ్ళు ఉంటాయి. అయితే విజయ్ గురుమూర్తి అనుకోకుండా చనిపోవడంతో, విజయ్ గురుమూర్తి పోలికలతో ఉన్న అతన్ని పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే ఉన్నట్టుండి ఆ వ్యక్తి విజయ్ గురుమూర్తి లాగా మాట్లాడడం, ఆలోచించడం చేస్తాడు. దీని వెనక బ్రెయిన్ మార్పిడి అనేది ఉందని తెలుసుకుని అతడు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు. చివరికి అసలు విజయ్ గురుమూర్తిని పోలిన వ్యక్తి ఎవరు? అనేది మీరు మూవీ చూడాల్సిందే.
Advertisement
ఇక ఈ షో చూసిన వారందరూ బిచ్చగాడు 2 పై పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. బిచ్చగాడు సినిమా కంటే సీక్వెల్ ఎంతో బాగుందని, విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడని కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు. బ్రెయిన్ మార్పిడిపై జరిగే ప్రయోగం కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్రకథ అని చెబుతున్నారు. డబ్బు మరియు ఎమోషన్స్ చుట్టూ సాగే ఈ కథలో ప్రతి ఒక్కరు జీవించేసారని చెబుతున్నారు. సినిమాలోని సెంటిమెంట్ సీన్స్ హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుందంటున్నారు.
ప్లస్ పాయింట్లు:
కథ
కొన్ని సన్నివేశాలు
యాక్షన్
విజయ్ ఆంటోనీ
మైనస్ పాయింట్లు:
సాగదీత
రేటింగ్ : 3/5
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
కాంగ్రెస్ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్..క్లారిటీ ఇదే
చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ విడాకులు ఇస్తున్నాడు – సీఎం జగన్