Home » బిచ్చ‌గాడు సినిమాను చేతులారా వ‌దులుకున్న‌ టాలీవుడ్ స్టార్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు వ‌దులుకున్నారంటే..?

బిచ్చ‌గాడు సినిమాను చేతులారా వ‌దులుకున్న‌ టాలీవుడ్ స్టార్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు వ‌దులుకున్నారంటే..?

by AJAY
Ad

క‌థ‌ల ఎంపిక‌లో హీరోలు వేసే త‌ప్ప‌ట‌డుగుల వ‌ల్ల సూప‌ర్ హిట్ సినిమాల‌ను మిస్ చేసుకుంటారు. అంతే కాకుండా క‌థ న‌చ్చినా కొంత‌మంది ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా మంచి సినిమాల‌ను చేతులారా వ‌దులుకుంటారు. ఇక బిచ్చ‌గాడు సినిమాను కూడా ఓ టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడు. ఆ సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. బిచ్చ‌గాడు సినిమా త‌మిళంలో తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో విజ‌య్ ఆంటోని హీరోగా న‌టించాడు. ఈ సినిమాలోని పాటలు డైలాగులు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో హీరో విజ‌య్ ఆంటోని బెగ్గ‌ర్ గెట‌ప్ లో న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. త‌ల్లి ఆరోగ్యం కోసం కోట్ల ఆస్తులు ఉన్న‌ప్ప‌టికీ ఓ స్వామిజీ చెప్పాడ‌ని హీరో బిచ్చ‌గాడిలా దీక్ష చేస్తాడు.

Advertisement

ఇక ఈ క‌థ నెవ్వ‌ర్ బిఫోర్ అనే చెప్పాలి. దాంతో ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక తెలుగులో అయితే మొద‌ట టైటిల్ చూసి ఇదేం సినిమారా బాబోయ్ అనుకున్నారు. కానీ సినిమా విడుద‌ల త‌ర‌వాత రెస్పాన్స్ చూసి అవాక్క‌య్యారు. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీ వ‌స్తే మిస్ కాకుండా చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ సినిమా ఆఫ‌ర్ హీరో శ్రీకాంత్ వ‌ద్ద‌కు వ‌చ్చింద‌న్న సంగ‌తి చాలా మందికి తెలియదు.

srikanth

srikanth

తాజా ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని శ్రీకాంత్ స్వ‌యంగా వెల్ల‌డించారు. మ‌హాత్మ సినిమాకు విజ‌య్ ఆంటోని మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో అప్ప‌టినుండి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఇక బిచ్చ‌గాడు సినిమాను మొద‌ట తాను చూశాన‌ని తెగ న‌చ్చేసింద‌ని చెప్పారు. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. కానీ రెమ్యున‌రేష‌న్ తో పాటూ బ‌డ్జెట్ ఎక్కువ అవుతుంద‌నే కార‌ణంతో డ‌బ్ చేసి విడుద‌ల చేశామ‌ని చెప్పారు.

ALSO READ :విరూపాక్ష సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

Visitors Are Also Reading