Home » bhermla nayak : భీమ్లా నాయ‌క్ నుండి వీడియో సాంగ్ లీక్…!

bhermla nayak : భీమ్లా నాయ‌క్ నుండి వీడియో సాంగ్ లీక్…!

by AJAY
Ad

టాలీవుడ్ ను లీకుల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు హీరోగా నటిస్తున్న స‌ర్కారు వారి పాట సినిమాలోని ఓ పాట‌ను లీక్ చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాలోని క‌ళావ‌తి అనే పాట‌ను విడుద‌ల‌కు మందే లీకు రాయ‌ళ్లు బ‌య‌ట పెట్టేశారు. దాంతో త‌మ‌న్ వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఓ ఆడియోను కూడా విడుద‌ల చేశాడు. అయితే ఇప్పుడు లీకుల బెడ‌ద ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్ ను కూడా ప‌ట్టుకుంది. భీమ్లా నాయ‌క్ సినిమాలోని భీమ్ భీమ్ భీమ్ భీమ్లా నాయ‌క్ అనే పాట‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే ఈ పాట లిర‌క‌ల్ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కాగా ఇప్పుడు ఇదే పాట‌లోని ఓ డ్యాన్స్ వీడియో క్లిప్ లీక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా భీమ్లా నాయ‌క్ సినిమాను మ‌ల‌యాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటూ రానా కూడా హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీగా నిత్యామీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా రానాకు జోడీగా సంయుక్త మీన‌న్ న‌టిస్తోంది.

Visitors Are Also Reading