Home » ప‌వ‌ర్ స్టార్ “భీమ్లా నాయ‌క్” ట్రైల‌ర్ వ‌చ్చేసింది…!

ప‌వ‌ర్ స్టార్ “భీమ్లా నాయ‌క్” ట్రైల‌ర్ వ‌చ్చేసింది…!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన సినిమా భీమ్లా నాయ‌క్. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. ఈ చిత్రం మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటూ రానా కూడా హీరోగా న‌టించారు. అంతే కాకుండా సినిమాలో ప‌వ‌ర్ క‌ల్యాణ్ కు హీరోయిన్ గా నిత్యా మీన‌న్ న‌టించింది.

Advertisement

Advertisement

రానాకు జోడీగా సినిమాలో సంయుక్త మీన‌న్ న‌టించింది. ఇక ఈ సినిమా టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా స‌ర్వ‌త్రా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా తాజాగా నేడు సినిమా టైలర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ట్రైల‌ర్ లో ప‌వ‌న్ రానా మ‌ధ్య డైలాగులు….ట్రైల‌ర్ లోని యాక్ష‌న్ సీన్లు ఎంతగానో ఆక‌ట్టుకుంటున్నాయి. అంతే కాకుండా త‌మ‌న్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంత‌గానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ఈనెల 25న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading