పెద్ద హీరో సినిమా వచ్చిందంటే అభిమానులకు పండుగ వాతావరణమే ఉంటుంది. ముఖ్యంగా సినిమా థియేటర్ కు వెళ్లి టికెట్ కొనుగోలు చేసే రోజులు పోయాయి. టికెట్లను బుక్ మై షో, జస్ట్ టికెట్స్, పేటీఎం ద్వారా సినిమా టికెట్లను బుక్ చేసుకుని టికెట్లను విక్రయిస్తుంటారు. ఫిబ్రవరి 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
Also Read : VIDEO : మేనల్లుడితో కలిసి నాగబాబు కండల ప్రదర్శన..వీడియో వైరల్…!
Advertisement
నైజాం ఏరియాలకు చెందిన తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీ బుక్ మై షో ని నిషేదించాలని నిర్ణయించుకున్నారు. బుక్ మై షో ఎక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయిస్తోందని.. ఆ ఎఫెక్ట్ తో చివరికీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉందని తెలుగు చిత్ర పరిశ్రమకు తెలిసింది.
Advertisement
టిక్కెట్ ధరలు తేల్చే వరకు ఆయా థియేటర్లలోని బుకింగ్ కౌంటర్ల మాత్రమే టిక్కెట్లను విక్రయించాలని ఎగ్జిబిటర్లను చిత్ర పరిశ్రమ కోరినట్టు సమాచారం. బుక్ మై షోలో టిక్కెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. భీమ్లానాయక్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రేక్షకులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బుక్ మై షో ద్వారా టికెట్ మీద కమీషన్ దాదాపు రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. గంటల తరబడి లైన్‌లో నిలబడలేక ఎక్కువ మంది ఆన్‌లైన్ బుకింగ్‌కే ఆసక్తి చూపుతున్నారు. బుక్‌మై షో ఎక్కువగా వసూలు చేస్తుండడంతో భీమ్లానాయక్ డిస్ట్రిబ్యూటర్ బుక్ మై షో కు షాక్ ఇచ్చారు.
Also Read : బాలయ్యా మజాకా…డూప్ లేకుండా ఫ్లై ఓవర్ పై నుండి దూకేశాడు…!