Telugu News » Blog » సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ గిఫ్ట్ ఏమిటో తెలుసా..?

సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ గిఫ్ట్ ఏమిటో తెలుసా..?

by Anji
Ads

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కుతున్న చిత్రం భీమ్లానాయ‌క్‌. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కుదిరిన‌ట్ట‌యితే ఈ సంక్రాంతి బ‌రిలో భీమ్లానాయ‌క్ సంద‌డి చేసేవాడు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి మరొక‌సారి ప్ర‌జ‌ల‌పై దాడి చేయ‌డం, ఈ సినిమా ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డింది. అయినా సంక్రాంతికి అభిమానుల‌ను మాత్రం సంతోష‌ప‌ర‌చ‌నున్నార‌ట మేక‌ర్స్‌.

Advertisement

 

For 'RRR,' 'Radhe Shyam,' 'Bheemla Nayak' release postponed to February |  NewsBytes

Advertisement

Advertisement

ఎప్ప‌టి నుంచో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూడ‌డం, వాయిదా ప‌డితే ఫీల్ అవ్వ‌డం జ‌రుగుతున్న త‌రుణంలో సంక్రాంతికి భీమ్లానాయ‌క్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసి అభిమానుల‌కు ఉత్సాహ‌ప‌ర‌చనున్నార‌ట మూవీమేక‌ర్స్‌. తాజాగా అంతుతున్న స‌మాచారం బ‌ట్టి చూస్తే ఇప్ప‌టికే టీజ‌ర్ విడుద‌ల‌కు సంబంధించిన అన్ని ప‌నుల‌ను పూర్తి చేశార‌ట‌. అయితే సంక్రాంతి గిప్ట్‌గా సినిమాను విడుద‌ల చేయ‌క‌పోయినా క‌నీసం టీజ‌ర్‌ను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మూవీ మేక‌ర్స్ మాత్రం ఇంకా అధికారికంగా ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ సోష‌ల్ మీడియాలో ఈ వార్త మాత్రం వైర‌ల్ అవుతోంది.

You may also like