Home » భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ రివ్య్వూ ఇచ్చిన త‌మ‌న్…సినిమా ఎలా ఉందంటే!

భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ రివ్య్వూ ఇచ్చిన త‌మ‌న్…సినిమా ఎలా ఉందంటే!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం భీమ్లానాయ‌క్ ఈ సినిమాకు సాగ‌ర్ కే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను మ‌లయాళ సూప‌ర్ హిట్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటూ రానా కూడా హీరోగా న‌టించాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ఈ చిత్రానికి మాట‌ల‌తో పాటూ స్క్రీన్ ప్లేను అందించారు. ఇక ఈ సినిమాకు త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్ప‌టికే కొన్ని పాట‌లు విడుద‌ల చేయగా ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి.

bheemla nayak review

Advertisement

Advertisement

అంతే కాకుండా టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆక‌ట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమా తాను చూసాన‌ని త‌మ‌న్ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో క‌లిసి తాను సినిమా చూశాన‌ని త‌మ‌న్ వెల్లడించారు. ఈ సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లోనే కెరీర్ బెస్ట్ సినిమాగా నిలుస్తుంద‌ని చెప్పారు. సినిమా ఎక్ట్రాడిన‌రీగా ఉంద‌ని త‌మ‌న్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా త‌ను అనుకున్న మేర‌కు మంచి మ్యూజిక్ ఇవ్వ‌గ‌లిగాన‌ని చెప్పారు. దాంతో త‌మన్ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అవుతున్నాయి.

also read :  స‌మంత విజ‌య్ దేవ‌రకొండ‌తో “ఊ” అంటుందా..?

Visitors Are Also Reading