Home » ఇంతకీ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరు? జగన్ భార్య భారతికి ఏమవుతారు?

ఇంతకీ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరు? జగన్ భార్య భారతికి ఏమవుతారు?

by Bunty
Ad

మాజీ MP వివేకానంద రెడ్డి హ** కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు జరిగాయి. 2019 మార్చి 15న హ**జరుగగా, అదే రోజు అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మార్చి 28న వివేకా పీఏతో పాటుగా ముగ్గురు అరెస్ట్, జూన్ 13న ఎస్పీ స్థాయి అధికారికి సిట్ బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 2న కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతి చెందారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 23న విచారణకు హాజరుకావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

READ ALSO : కోహ్లీకి దెబ్బ మీద దెబ్బ! భారీ షాక్ ఇచ్చిన BCCI

Advertisement

ఇక రెండు రోజుల కిందట వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో తెరపైకి వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు వచ్చింది.  ఇంతకీ వైయస్ భాస్కర్ రెడ్డి ఎవరు? జగన్ భార్య భారత్ కి ఏమవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడా వివరాల్లోకి వెళితే…వివేకా హత్య కేసులో అరెస్టు అయిన వైయస్ భాస్కర్ రెడ్డి… సీఎం జగన్ సతీమణి భారతికి సొంత మేనమామ. భారతి తల్లి ఈసీ సుగుణమ్మకు భాస్కర్ రెడ్డి స్వయానా సోదరుడు. అంతేకాదు, భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీ కూడా భారతికి మేనత్త అవుతారు. అది కూడా బంధురికంలోనే. అది ఎలా అంటే భారతి తండ్రి గంగిరెడ్డి సోదరి లక్ష్మీ.

Advertisement

READ ALSO : IPL 2023 : గాయమైనా.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్

YS Vivekananda Reddy Had A Second Marriage & Two Affairs: Avinash Reddy

వీరు కుండమార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరి బంధురికాలకు సంబంధించి మరింత లోతుల్లోకి వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. అయితే, ఈ వివరాలు మొత్తాన్ని హత్యకు గురైన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. ఆయన ఏం చెప్పారంటే… వైయస్ వెంకటరెడ్డి (ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముత్తాత)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ కొడుకు చిన్న కొండారెడ్డి. అతడి తొమ్మిదో కొడుకు వైయస్ భాస్కర్ రెడ్డి. అదేనండి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి. కాగా ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు స్థాయిలో ఉంది.

READ ALSO :  తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?

Visitors Are Also Reading