Home » ఆరేళ్లలోపు పిల్లలు ఉంటే జాగ్రత్త.. ఆ వ్యాధి సోకిందంటే కుప్పకూలుతున్న చిన్నారులు.. ఎక్కడంటే..!!

ఆరేళ్లలోపు పిల్లలు ఉంటే జాగ్రత్త.. ఆ వ్యాధి సోకిందంటే కుప్పకూలుతున్న చిన్నారులు.. ఎక్కడంటే..!!

by Sravanthi
Ad

తల్లిదండ్రులు ఇది గమనించారా.. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి.. అంతుచిక్కని మహమ్మారి చిన్నపిల్లలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అది సోకిన గంటల్లోనే చిన్నారులు కుప్పకూలిపోతున్నారు. ఈ వ్యాధి ప్రస్తుతం యూకె అమెరికా లాంటి దేశాలలో తన ప్రతాపం చూపిస్తోంది. ఈ వ్యాధి సోకిన పిల్లలు కాలేయానికి సంబంధించిన సమస్య, శ్వాసలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తాత్కాలిక చికిత్స అందిస్తున్న కానీ వ్యాధి ఏమిటి.. దాని లక్షణాలు..

Advertisement

Advertisement

అది ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు వైద్యులు. గత సంవత్సరం అమెరికాలో తొమ్మిది మంది చిన్న పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరందరి వయసు ఆరు సంవత్సరాల లోపే.. వీరిని పరీక్షించిన వైద్యులు వాపు వల్ల కాలేయం దెబ్బతింటుందని అన్నారు. దీని తర్వాత మూడు నెలల్లోనే 74 మంది పిల్లలు మళ్లీ అదే సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు.. అయితే ప్రస్తుతం మరో మూడు దేశాల్లో కూడా ఈ తరహా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వింత వ్యాధికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు ఆరోగ్య నిపుణులు.

 

వ్యాధి లక్షణాలు : దురద, చర్మం పసుపు రంగులోకి మారడం, విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, మూత్రం పచ్చగా రావడం, మలం బూడిద రంగులో వెళ్లడం కనిపిస్తాయి.

ALSO READ:

ఎన్టీఆర్ కి బయపడి వాయిదా వేసుకున్న చిరు సినిమా అదే అని తెలుసా ?

పాస్ లేకపోతే కోహ్లీలాగే పేస్ పెడతారు…!

 

Visitors Are Also Reading