Home » పెళ్లి చేసుకునేటప్పుడు స్త్రీపురుషుల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే మంచిదో తెలుసా..!

పెళ్లి చేసుకునేటప్పుడు స్త్రీపురుషుల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే మంచిదో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

మ‌నిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. కాబ‌ట్టి పెళ్లి చేసుకునే భాగ‌స్వామి విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. నిజానికి పురాణాల ప్ర‌కారం పెళ్లిళ్లు స్వ‌ర్గంలో నిశ్చ‌యించ‌బ‌డ‌తాయని చెబుతున్నాయి. అంతే కాకుండా అన్ని వేడుక‌ల్లోనూ వివాహం ఘ‌న‌మైన‌ద‌ని చెబుతున్నాయి. ప్ర‌తిమ‌నిషి జీవితంలో పెళ్లి ఎంతో ముఖ్య‌మైన‌ది కాబ‌ట్టే పురాణాల్లో సైతం పెళ్లి గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకున్నారు. ఇక సాధార‌ణంగా స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటారు.

Advertisement

అయితే కంప్యూట‌ర్ యుగంలో స్త్రీల‌ను స్త్రీలు…..పురుషుల‌ను పురుషులు కూడా చేసుకుంటున్నారు. కానీ అది ల‌క్ష‌ల్లో ఒక‌రిద్ద‌రు మాత్రమే. కాబట్టి ఆ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదు. కాబ‌ట్టి ఇప్పుడు స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ఇద్ద‌రి మ‌ధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో చూద్దాం…..మ‌నదేశంలో పురుషుల క‌నీస‌వ‌య‌సు 21 కాగా స్త్రీల క‌నీస వ‌య‌సు 18 ఏళ్లు..ఇలా ఏజ్ గ్యాప్ ను నిర్ణ‌యించ‌డానికి కార‌ణం స్త్రీలు పురుషుల కంటే కాస్త ముందుగానే ప‌రిప‌క్వ‌త చెందుతారు.

Advertisement

కాబ‌ట్టి ఈ ఏజ్ గ్యాప్ లోనే ఎక్కువ పెళ్లిళ్లు జ‌రుగుతుంటాయి. అయితే ప్ర‌స్తుతం ఉన్న కాంపిటేష‌న్ లో ఉద్యోగం రావాలంటే క‌నీసం 25 ఏళ్లు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి ఉద్యోగం రాక‌ముందే పెళ్లి చేసుకుంటే ఆదాయం లేక ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా ఎలా బ్ర‌త‌కాలి…ఎవ‌రితో ఎలా న‌డుచుకోవాలి అనే విష‌యాలు కూడా పెద్ద‌గా తెలియ‌వు.

ఇదిలా ఉంటే మరికొంత మంది 30ఏళ్లు దాటితేనే గానీ పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. ఆ త‌ర‌వాత సంబంధాలు వెతికే స‌రికి ఏజ్ కాస్తా 35కు వెళ్లిపోతోంది. దాంతో అలాంటి పురుషులు 30 ఏళ్లు లేదా అంతే కంటే రెండేళ్లు చిన్న‌వారిని వివాహం చేసుకుంటున్నారు. అలా ఏజ్ పెరిగినా పిల్ల‌లు పుట్టే విష‌యంలో ఇబ్బందులు తలెత్తే అవ‌కాశం ఉంది. అయితే సాధార‌ణంగా పురుషుల‌కు 25 దాటిన త‌ర‌వాత 30 లోపు వివాహం చేసుకుంటే మంచిది. ఈ ఏజ్ లో ఉన్న‌వాళ్లు త‌మ కంటే మూడేళ్ల నుండి ఏడేళ్ల వ‌ర‌కూ చిన్న‌వారైన స్త్రీల‌ను వివాహం చేసుకుంటే ప‌ర్ఫెక్ట్ అని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

ALSO READ :

పెళ్లికి ముందు సహజీవనం చేస్తే వచ్చే సమస్యలు ఏంటి…? తప్పక తెలుసుకోండి…!

గూగుల్ పే ద్వారా గోల్డ్ అమ్మ‌డం, కొన‌డం ఏలాగో మీకు తెలుసా..?

Visitors Are Also Reading