Home » మూన్ మిల్క్ తో ఈ సమస్యలు అన్నీ దూరం.. ఈ మిల్క్ ని ఎలా చేసుకోవాలంటే..?

మూన్ మిల్క్ తో ఈ సమస్యలు అన్నీ దూరం.. ఈ మిల్క్ ని ఎలా చేసుకోవాలంటే..?

by Sravya
Ad

మూన్ మిల్క్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా మూన్ మిల్క్ తో పెంచుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఔషధంలా ఇది పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మూన్ మిల్క్ ని తీసుకుంటే మంచి నిద్ర కూడా పడుతుంది. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో పసుపు అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. సో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Advertisement

Advertisement

యాలకులు దాల్చిన చెక్క రుచిని పెంచుతాయి. అలానే జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి. అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. మూన్ మిల్క్ ని ఆవు పాలు లేదంటే గేదె పాలు ద్వారా మీరు చేసుకోవచ్చు. కావాలంటే వాల్నట్ మిల్క్, బాదం మిల్క్, జీడిపప్పు మిల్క్ ని అయినా మీరు వాడొచ్చు. ఒక కప్పు పాలు తీసుకుని వేడి చేసుకుని అర టీ స్పూన్ పసుపు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, యాలకులు పొడి కలుపుకోండి. అశ్వగంధ పొడి ని కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. బాగా మరిగిన తర్వాత చల్లా చల్లారనిచ్చి ఆ తర్వాత తీసుకోండి మంచి నిద్ర పట్టడం తో పాటుగా పోషకాలు అందుతాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

Also read:

Visitors Are Also Reading