సాధారణంగా బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. చలికాలంలో బెల్లం తీసుకోవడం వల్ల శక్తి పెరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందడంతో పాటు పలు వ్యాధులు నయం అవుతాయి. ఔషద గుణాలు పుష్కలంగా ఉండే బెల్లంలో చలికాలంలో శరీరానికి శక్తిని ఇచ్చే నీరు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ బీ, ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నటువంటి 10 గ్రాముల బెల్లంలో 38 కెరీల శక్తి ఉంటుంది. చలికాలంలో బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
Advertisement
సావోల్ హార్ట్ సెంటర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ విమల్ ఝంఝర్ తెలిపిన ప్రకారం.. ఆహారంలో ఎంత ఎక్కువ బెల్లం తీసుకుంటే మీ ఆరోగ్యం అంత ఎక్కువగా మెరుగుపడుతుంది. చాలా మంది స్వీట్లను తినడానికి ఇష్టపడుతుంటారు.తీపి పదార్థాలతో బెల్లం తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తుల మినహా అందరికీ బెల్లం వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లం తింటే ఏయే రోగాల భారీ నుంచి శరీరానికి రక్షణ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : Chanakya Niti : కష్టసమయంలో మనిషి సుఖంగా జీవించాలంటే డబ్బుని ఇలా ఖర్చు చేయాలి..!
చలికాలంలో బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం చాలా వెచ్చగా ఉంటుంది. రక్తనాళాలకు ఉపశమనం కలిగించి రక్తప్రసరణను సక్రమంగా ఉంచుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. బెల్లం తీసుకోవడం వల్ల లివర్ డిటాక్స్ వస్తుంది. కాలేయంలోని మురికిని బయటికి తీసి కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. రక్తంలోని మురికిని తొలగించి కాలేయాన్ని శుభ్రపరచడంలో బెల్లం ఎంతో సహాయపడుతుంది. మీ శరీరంతో పాటు కాలేయాన్ని డిటాక్స్ చేయాలనుకుంటే ప్రతిరోజూ బెల్లం తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమమైన మార్గం. బెల్లం ద్వారా టీని తయారు చేసుకోవచ్చు. బెల్లంలో ఉండే ప్రోటిన్ శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతుంది. బెల్లం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రతి రోజూ బెల్లం తిని ఆరోగ్యంగా ఉండండి.
Also Read : అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనే కోరిక ఉందంటున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్..!