రోజూ మొటిమల కోసం తేనెను ఉపయోగించడం వల్ల వాటి తీవ్రత మరియు ఫ్రీక్వెన్సీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాలక్రమేణా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న మొటిమలను మరింత త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. మచ్చల ప్రభావాన్ని కూడా మరింత తగ్గిస్తుంది. రోజువారీ చర్మ సంరక్షణ దినచర్యలో తేనెను చేర్చడానికి అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి. తేనెలో పది రకాల ఖనిజాలు, ఏడు రకాల ఎమైనో యాసిడ్స్, సహజ ఎంజైమ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని రక్షించడంలో దోహదం చేస్తాయి.
Advertisement
Advertisement
బొప్పాయి గుజ్జులో తేనెని కలిపి ముఖానికి అప్లై చేస్తే చాలా మంచిది. ముప్పై నిమిషాల తరువాత దాన్ని గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ మిశ్రమం చర్మంపై ఉన్న సమస్యల్ని తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే త్రిఫల చూర్ణంలో కూడా తేనని కలిపి ముఖానికి అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు ఉంచండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగివేస్తే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇంకా, తేనే మరియు నిమ్మరసాన్ని కూడా కలిపి అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు ఉంచవచ్చు. దాని వలన కూడా ముఖం చాలా అందంగా కనిపిస్తుంది.
మొటిమలపై నేరుగా తేనెని రాసి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత దానిని గోరు వెచ్చని నీటితో కడిగివేయాలి. ముఖంపై మచ్చలు తగ్గేవరకూ ఇలా రిపీట్ చేస్తూనే ఉండాలి. అలో వెరా, తేనెని కలిపి రాయడం వలన కూడా చాల ప్రయోజనం ఉంటుంది. మొటిమలు మాత్రమే కాకుండా శరీరంపై ఉండే మచ్చలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. అయితే వీటిని అప్లై చేసుకున్నప్పుడు సబ్బుని, పేస్ వాష్ లను ఉపయోగించకపోవడమే మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!