Home » Hair Tips : జుట్టు ఎక్కువగా జుట్టు రాల‌డానికి ఈ ఐదు కార‌ణాలే కార‌ణం.. శ్ర‌ద్ధ వ‌హించ‌డంలో ఇక ఆల‌స్యం చేయ‌కండి..!

Hair Tips : జుట్టు ఎక్కువగా జుట్టు రాల‌డానికి ఈ ఐదు కార‌ణాలే కార‌ణం.. శ్ర‌ద్ధ వ‌హించ‌డంలో ఇక ఆల‌స్యం చేయ‌కండి..!

by Anji
Ad

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో చాలా మందికి జుట్టు రాలే స‌మ‌స్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఆరోగ్య సంర‌క్ష‌ణ అందం వంటి సంర‌క్ష‌ణ‌కు ద‌గ్గ‌రి సంబంధం ఉంటుంది. చాలా సంద‌ర్భాల్లో జుట్టు రాలే స‌మ‌స్య ఓ స‌వాలు అయిపోయింది. అటువంటి ప‌రిస్థితుల‌కు ప‌రిష్క‌రారం కావాలంటే మ‌నం దానిపై త‌ప్ప‌కుండా శ్ర‌ద్ధ వ‌హించాల్సిందే. చ‌ర్మ వ్యాధుల నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రోజుకు సాధార‌ణ వెంట్రుక‌ల్లో 50 వ‌ర‌కు రాల‌డం సాధార‌ణం. కానీ అంత‌క‌న్న ఎక్కువ‌గా జుట్టు రాలిపోతే మాత్రం జాగ్ర‌త్త అవ‌స‌రమ‌ని సూచిస్తున్నారు. జుట్టు ఎక్కువ‌గా రాలితే త‌ప్పకుండా వైద్యుడిని సంప్ర‌దించాలి. పొడ‌వాటి జుట్టు ఉన్న వారు జుట్టు రాల‌డాన్ని త్వ‌ర‌గా గ‌మ‌నిస్తారు. అందువ‌ల్ల అటువంటి ప‌రిస్థితుల‌న్నింటిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. హెయిర్ స్టైల్ అలవాట్లు, రెగ్యుల‌ర్ హెయిర్ క‌ల‌రింగ్ కార‌ణంగా ముఖ్యంగా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ‌గా జుట్టును కోల్పోతారు. అంతేకాదు. గ‌ర్భం, మెనోపాజ్ వంటి జీవితం సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎక్కువ మంది మ‌హిళ‌ల్లో జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ప్ర‌తి రోజు త‌ల‌స్నానం చేయ‌డం మంచిది. త‌ల‌స్నానం చేయక‌పోతే స్కాల్ప్ మురికిగా మారుతుంది. మురికి చెమ‌ట‌, మ‌లినాలు, చుండ్రు పెర‌గ‌డం వల్ల జుట్టు రాలే స‌మ‌స్య పెరుగుతుంది. కొత్త జుట్టు పెర‌గ‌డాన్ని నిరోదిస్తాయి. దీని ఫ‌లితంగా మీరు జుట్టు రాల‌డాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. ప్ర‌తి రోజు శుభ్రంగా త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల వెంట్రుక‌లు రాలే స‌మ‌స్య త‌గ్గుతుంది.

 

సాధార‌ణంగా చాలా మంది బిగుతుగా ఉండే హెయిర్ క్లిప్పులు, హెయిర్ బ్యాండ్ల‌ను ధ‌రించ‌డం ద్వారా జుట్టు ఎదుగుద‌ల‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అంతేకాదు.. జుట్టు రాలిపోతుంది. ప్ర‌తిరోజూ హెయిర్ పొనిటేల్ ను టైట్ బ్యాండ్ల వ‌ల్ల త‌ల ఒత్తిడికి గురై జుట్టు డ్యామేజ్ అవ్వ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. కాబ‌ట్టి జుట్టును క‌ట్టుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Advertisement

అదేవిధంగా క్ర‌మం త‌ప్ప‌కుండా హెయిర్ డ్ర‌య‌ర్స్‌, క‌ర్లింగ్‌, స్ట్రైయిట్న‌ర్ వంటి సాధ‌నాల‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు పొడిబారుతుంది. అదేవిధంగా విరిగిపోయే ప్ర‌మాదం కూడా ఉంది. చాలా వ‌ర‌కు వీటి వ‌ల్ల జుట్టు రాలిపోయే అవ‌కాశ‌ముంది. అధిక వేడి వ‌ల్ల జుట్టు బ‌ల‌హీన ప‌డిపోతుంది. జుట్టులో తేమ తొల‌గిపోతుంది. వెంట్రుక‌లు విరిగిపోయే అవ‌కాశ‌ముంది. అందువ‌ల్ల వాటిని ఎక్కువ‌గా వాడ‌కూడ‌దు.

 

చుట్టు రాల‌డానికి మ‌రో కార‌ణం పోష‌కాహార లోపం. ఐర‌న్ అమైనో ఆమ్లాలు లోపం వ‌ల్ల జుట్టు రాలిపోతుంది. హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఐర‌న్ చాలా అవ‌స‌రం. ఇది మీ శ‌ర‌రీంలో క‌ణాల పెరుగుద‌ల, మ‌ర‌మ్మ‌తు కోసం ఆక్సిజ‌న్ ను తీసుకెళ్తుంది. జుట్టు పెరుగుద‌ల‌ను ప్రేరేపించే క‌ణాల‌తో స‌హా మీ జుట్టు ఎక్కువ‌గా కెరాటిన్ తో త‌యార‌వుతుంది. క‌రాటే ఉత్ప‌త్తి కావ‌డానికి శ‌రీరానికి మొత్తం 18 అమైనో ఆమ్లాలు అవ‌సరం.

జుట్టు రాలిపోవ‌డానికి మ‌రో కార‌ణం ఒత్తిడి. ఇక ఒత్తిడి అనేది చిన్న విష‌యం కాదు. అవి త‌రుచుగా వ‌స్తూనే ఉంటాయి. ఒత్తిడి వ‌ల్ల జుట్టు స‌గం రాలిపోతుంది. హెయిర్ పొలికల్స్ ను విశ్రాంతి ద‌శ‌లోకి నెట్టి వేస్తుంది. కాల‌క్ర‌మేనా జుట్టు దువ్విన‌ప్పుడు లేదా త‌ల‌స్నానం చేసిన‌ప్పుడు వెంట్రుక‌లు రాలిపోతాయి. ముఖ్యంగా ఈ 5 కార‌ణాల వ‌ల్ల‌నే జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : 

పెళ్లికి ముందు సహజీవనం చేస్తే వచ్చే సమస్యలు ఏంటి…? తప్పక తెలుసుకోండి…!

మీరు వాకింగ్ చేస్తున్నారా..? వాకింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు చేయ‌కుండా ఉండ‌రు..!

Visitors Are Also Reading