Home » జ్ఞానవాపి మసీదుకు ముందు అక్కడ హిందూ దేవాలయం ఉంది.. ఏఎస్ఐ సర్వే ఏం చెబుతుందంటే..?

జ్ఞానవాపి మసీదుకు ముందు అక్కడ హిందూ దేవాలయం ఉంది.. ఏఎస్ఐ సర్వే ఏం చెబుతుందంటే..?

by Anji
Ad

ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో మసీదుకు పూర్వం హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక సూచిస్తోందని హిందూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు నివేదిక సూచిస్తోందని తెలిపారు. మసీదులో లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయి. నిర్మాణానికి నష్టం జరుగలేదు. శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ఇప్పటికే ఉన్న నిర్మాణంలో గతంలో ఉన్న నిర్మాణానికి సంబంధించిన స్థంబాలను ఉపయోగించారు. 

Advertisement

Advertisement

ముందుగా ఉన్న నిర్మాణం అక్కడే ఉందన్నారు. స్థంబాల క్రమ పద్దతిలో అధ్యయనం చేశామని.. ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని.. ముందుగా ఉన్న ఆలయ కేంద్ర నిర్మాణాన్ని ప్రస్తుతం మసీద్ హాల్ గా ఉపయోగిస్తున్నారని.. ఆలయ మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు. చెక్కిన శిల్పాలను మళ్లీ ఉపయోగించేందుకు ధ్వంసం చేశారని జైన్ చెప్పారు. ప్రస్తుతం మసీదులో మునుపటి నిర్మాణానికి సంబంధించిన 34 శాసనాలు ఉపయోగించబడ్డాయని.. ఈ మసీదు తయారు చేసేందుకు ఆలయాన్ని ధ్వంసం చేశారన్నారు.

 

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ సర్వే చేశారని.. సైట్ లో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్టు తెలుస్తోందని ప్రస్తుత నిర్మాణం ముందు ఉన్న నిర్మాణంపై నిర్మించబడిందనే విషయాన్ని సూచిస్తుందన్నారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను కనుగొన్నట్టు జైన్ పేర్కొన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే రిపోర్టును ఇరు పక్షాలకు ఇవ్వాలని వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ రిపోర్టును బహిరంగ పరచాలని కోర్టు తెలిపింది. 

Visitors Are Also Reading