Home » అందంగా ఉన్నా కానీ పట్టించుకోవడం లేదట.. కారణం తెలుగమ్మాయి కావడమేనా..!!

అందంగా ఉన్నా కానీ పట్టించుకోవడం లేదట.. కారణం తెలుగమ్మాయి కావడమేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు మూవీ ఇండస్ట్రీ లో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో ముఖ్యంగా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన వారు మాత్రం ఇతర భాషలకు చెందిన వారే. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కానీ ఏ ఒక్కరిని కూడా పట్టించుకున్న దాఖలాలు మాత్రం ఇప్పటివరకు లేవని, ఒకవేళ వారికి తెలుగులో ఆఫర్లు వచ్చినా చిన్న చిన్న బి గ్రేడ్ పాత్రలో మాత్రమే అని అంటున్నారు. మన తెలుగు అమ్మాయిలకు ఎంత టాలెంట్ ఉన్నా అందం ఉన్న తెలుగు ఇండస్ట్రీలో మాత్రం రాణించలేక పోతున్నారు.

Advertisement

కానీ మన వారు వేరే భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ల మీద సక్సెస్ లు కొడుతున్నారు. సక్సెస్ వచ్చిన తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వారిని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. హీరోయిన్ అంజలి మన తెలుగు అమ్మాయి. ప్రస్తుతం అనే తమిళనాట మంచి విజయాలను సొంతం చేసుకుంటోంది. తెలుగు ఇండస్ట్రీలో ఆమెను ప్రేక్షకులు ఆదరించిన కానీ ఇండస్ట్రీ వర్గాల వారు పట్టించుకోవడం లేదు.

Advertisement

ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తి మూవీతో తెలుగు అభిమానులకు పరిచయం అయినటువంటి ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్.. ఎంతో అందం అభినయం ఉన్నా ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆమెను పక్కన పెట్టేశారు. ఆమె పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా కానీ ఆమె మూలాలు మాత్రం తెలుగు ఇండస్ట్రీకి చెందినవే. తెలుగు అమ్మాయి అని ఒక చిన్న ట్యాగ్ ఉండటం వల్ల ఆమెకు ఆఫర్లు రావడం లేదట. తాజాగా ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోలు చూసి అయినా ఆసక్తి కలుగుతుందేమో అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇంత అందం ఉన్న మన తెలుగు వాళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదని చాలామంది అనుకుంటున్నారు.

ALSO READ;

సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా..!

భ‌య‌మేస్తుంది నాన్న‌ నేను బ‌తుక‌లేను.. వెలుగులోకి విస్మ‌య ఆడియో క్లిప్‌..!

 

Visitors Are Also Reading