Home » BEAST REVIEW : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!

BEAST REVIEW : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!

by AJAY
Ad

BEAST REVIEW : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!:తమిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా చిత్రం బీస్ట్. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్ గా పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా క‌ళానిధి మారన్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రించారు.

beast-review

beast-review

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మకూర్చారు. ఇక ఎప్రిల్ 13న పాన్ ఇండియా లెవ‌ల్ లో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా అంచ‌నాల‌ను రీచ్ అయ్యిందా..? లేదా అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం..?

Advertisement

BEAST REVIEW in Telugu  : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!

BEAST REVIEW in Telugu  : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్....!

BEAST REVIEW in Telugu  : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!

క‌థ క‌థాంశం :

క‌థ‌లోకి వెళితే విజ‌య్ వీర‌రాఘ‌వ‌న్ ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్ చేప‌డ‌తాడు. ఈ సీక్రెట్ ఆప‌రేషన్ లో ఓ చిన్నారి ప్రాణం కోల్పోతుంది. అయితే త‌న వ‌ల్లే ఆ పాప చ‌నిపోయిందన్న డిప్రెష‌న్ లోకి వీర‌రాఘ‌వ‌న్ వెళ్లిపోతాడు. చాలా కాలం పాటు డిప్రెష‌న్ లో ఉన్న వీర‌రాఘ‌వ‌న్ అందులో నుండి బ‌య‌ట‌ప‌డేందుకు డాక్ట‌ర్ ప్రీతి పూజా హెగ్డేను క‌లుస్తాడు. ఆ త‌ర‌వాత అన్ని సినిమాల్లో చూపించిన విధంగానే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. ఇదిలా ఉండగా విజ‌య్ త‌న టీం తో క‌లిసి ఓ మాల్ లోకి వెళ్ల‌గా అనుకోకుండా అదే మాల్ ను టెర్ర‌రిస్ట్ లు టార్గెట్ చేస్తారు. దాంతో ఆ మాల్ లోని ప‌రిస్థితుల‌ను వీర‌రాఘ‌వ‌న్ అండ్ టీం ఎలా ఎదురుకుంటారు. టెర్ర‌రిస్ట్ ల ఆట‌ల‌ను ఎలా అరిక‌డ‌తారు అన్న‌దే ఈ సినిమా క‌థాంశం.

Advertisement

BEAST REVIEW in Telugu  : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్....!

BEAST REVIEW in Telugu  : విజ‌య్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!

విశ్లేష‌ణ‌ :
ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ డాక్ట‌ర్ , కోకో కోకిల అనే సినిమాల‌తో త‌న‌ను త‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే విజయ్ అత‌డికి ఆఫ‌ర్ ఇచ్చాడు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. కానీ ఆ అంచ‌నాలను రీచ్ అవ్వ‌లేకపోయారు. సినిమాలో హీరో ఎలివేష‌న్స్ ఎక్కువ అవ్వ‌డంతో క‌థ ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. అన‌వ‌స‌ర ఎలివేష‌న్లు ప్రేక్ష‌కుల‌కు చిరాకు పుట్టించాయి.

సినిమాలో పొలిటిక‌ల్ డ్రామా కూడా ఎక్కువ అవ్వడం మైన‌స్ అయ్యింది. సినిమాలో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చే కామెడీ సీన్లు, అనిరుధ్ అందించిన మ్యూజిక్, విజ‌య్ స్క్రీన్ ప్రెసెన్స్, అర‌బిక్ కుత్తు పాట త‌ప్ప మ‌రో చెప్పుకోద‌గ్గ విష‌యం లేదు. విజ‌య్ వీరాభిమానులు అయితే ఎలివేష‌న్స్ కోస‌మైనా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

ఇవి చ‌ద‌వండి :

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

బిగ్‌బాస్ బ్యూటితో సహా ప్రెగ్నెంట్‌గా ఉన్న క‌థానాయిక‌లు వీళ్లే..!

పాక్ కొత్త ప్రధాని భార్యల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…..!

Visitors Are Also Reading