భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఎటువంటి ఆటగాడు అనేది అందరికి తెలిసిందే. అయితే ఆసియా కప్ కోక్సామ్ టీంతో కలిసి యూఏఈ వెళ్లిన జడేజా.. అక్కడ మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఆ మ్యాచ్ తర్వాత హాంగ్ కాంగ్ తో కూడా ఆడిన జడేజా.. గాయపడ్డాడు అనే న్యూస్ బయటకు వచ్చింది. ఆ గాయం వల్ల జడేజా ఆసియా కప్ కు దూరం కూడా అయ్యాడు.
Advertisement
అయితే ఈ న్యూస్ రావడం అందరూ జడేజా ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు అనే అనుకున్నారు. కానీ తాజాగా ఈ గాయంపై జడేజాను బీసీసీఐ ఆరా తీయగా కొన్ని నమ్మలేని నిజాలు అనేవి బయటకు వచ్చాయి. జడేజా గాయ పడటానికి అసలు కారణం తెలిసింది. యూఏఈలో భారత జట్టు ఉంటున్న హోటల్ లోని స్విమ్మింగ్‌పూల్‌లో ఓ వాటర్ బేస్డ్ యాక్టివిటీలో జడేజాను పాల్గొనాల్సిందిగా బీసీసీఐ మేనేజ్మెంట్ సూచించగా జడేజా అదే పని చేసాడు.
Advertisement
కానీ ఆ యాక్టివిటీలోనే జడేజా గాయంకు గురి అయ్యి మొత్తం సిరీస్ కు దూరం అయ్యాడు అని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు జడేజాకు ఈ యాక్టివిటీ గురించి ఎవరు చెప్పారు.. అతడిని ఎవరు పంపించారు అనే విషయంపై విచారణకు బీసీసీఐ ఆదేశించినట్లు ఓ బీసీసీఐ అధికారి తాజాగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :