Home » మరోసారి కోర్టుకు వెళ్లిన గంగూలీ..!

మరోసారి కోర్టుకు వెళ్లిన గంగూలీ..!

by Azhar
Ad

భారత జట్టు స్వరూపాన్ని మార్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అప్పటివరకు టీం ఇండియా అంటే ఏం చేసిన సహిస్తూ.. ప్రశాంతంగా ఉంటారు అనే ఆలోచనను మార్చి… భారత జట్టుతో జాగ్రత్తగా ఉండాలి అనేలా చేసాడు. ఆటగాళ్లకు అగ్రేషన్ అనేది పరిచయం చేసాడు. అలాగే జట్టు విదేశాలలో విజయాలు సాధించడం నేర్పించాడు. ఇక ఇంత చేసిన గంగూలీ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా తన పదవిని కాపాడుకోవడం కోసం సుప్రీం కోర్టుకు మరోసారి వెళ్ళాడు. అయితే గంగూలీ 2019 లో భారత క్రికెట్ నియంత్రణ మండలికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ ఇప్పుడు ఆ స్థానానికి గండం వచ్చింది.

Advertisement

బీసీసీఐ నియమాల ప్రకారం ఎవరు అయిన సరే ఆరేళ్లకు మించిహ్ పదవి కాలంలో ఉండకూడదు. అది బీసీసీఐలోనైనా లేక రాష్ట్ర క్రికెట్ బోర్డులోనైనా.. రెండింటిలో కలిపి అయిన సరే.. ఒక్క వ్యక్తి ఆరు సంవత్సరాలు మించి పదవిలో కొనసాగకూడదు. అయితే ఆరు ఏళ్ళు వరుసగా ఓ పదవిలో ఉన్న తరువాత.. బీసీసీఐ నియమాల ప్రకారం ముద్దు ఏళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అప్పటివరకు బీసీసీఐ, రాష్ట్ర బోర్డులో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. ఆ తర్వాత మళ్ళీ రావచ్చు. అయితే ఇప్పుడు ఈ నియమని మార్చడానికి గంగూలీ అలాగే జై షా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

అయితే గంగూలీ 2014 నుండి కోల్కతా రాష్ట్ర బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే జై షా 2013 లోనే గుజరాత్ బోర్డులో ఉన్నాడు. కాబట్టి వీరిద్దరూ బీసీసీఐలో పదవిలోకి వచ్చిన ఆరు నెలలకే వీరి పదవి కాలం అనేది ముగిసిపోయింది. కానీ వీరు ఆ ఆరేళ్ళు అనే నియమాన్ని మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఆ విషయంలో ఏ విధమైన నిర్ణయం అనేది ప్రకటించడలేదు. అందుకే వీరు ఇంకా ఆయా పదవుల్లో ఉన్నారు. కానీ బీసీసీఐలో మూడేళ్లకు ఒక్కసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సెప్టెంబర్ లో ఆ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో మళ్ళీ.. అందులో పాల్గొనేందుకు మరోసారి బీసీసీఐ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. చూడాలి మరి ఇప్పుడైనా తీర్పు అనేది వస్తుందా.. లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీని తీసేస్తే బీసీసీఐకే నష్టం.. ఎలా అంటే..?

కోహ్లీకి పాకిస్థాన్, ఇంగ్లాడ్ కెప్టెన్ల సపోర్ట్…!

Visitors Are Also Reading