Home » కోహ్లీకి పాకిస్థాన్, ఇంగ్లాడ్ కెప్టెన్ల సపోర్ట్…!

కోహ్లీకి పాకిస్థాన్, ఇంగ్లాడ్ కెప్టెన్ల సపోర్ట్…!

by Azhar
Ad

టీం ఇండియా ఇండియా మాజీ కెప్టెన్గావిరాట్ కోహ్లీ ప్రస్తుతం సరైన ఫామ్ లో లేడు అనే విషయం తెలిసిందే. అందువల్ల అతని పై విమర్శల ప్రవాహం అనేది.. ఇప్పుడు తెలంగాణలో వస్తున్న వరద ప్రవాహాల మాదిరి ఆగకుండా వస్తూనే ఉన్నాయి. చాలా మంది మన భారత మాజీ ఆటగాళ్లే కోహ్లీని జట్టు నున్ఫ్ది తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు అతడిని జట్టులో ఉంచుతారు.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీకి విదేశీ ఆటగాళ్ల నుండి మద్దతు అనేది లభిస్తుంది.

Advertisement

ఇప్పటికే కోహ్లీని ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుషెన్ తన మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, ఇంగ్లాండ్ కెప్టెన్ జొస్ బట్లర్ తమ మద్దతు అనేది ఇచ్చారు. ఇండియా, పాకిస్థాన్ అంటేనే ఎప్పుడు ఉప్పు, నిప్పుల ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు బాబర్ కోహ్లీకి మద్దతు ఇవ్వడం అనేది వైరల్ గా మారింది. నిన్న ఇంగ్లాండ్ తో ఆడిన రెండో వన్డేలో కోహ్లీ విఫలమయ్యాడు. దాంతో బాబర్ నేడు తన ట్విట్టర్ లో కోహ్లీతో కలిసి ఉన్నా ఫోటోను జత చేస్తూ ” ఈ సమయం అనేది వెళ్ళిపోతుంది. ధైర్యంగా ఉండు” అంటూ కోహ్లీని జత చేసాడు.

Advertisement

అదే విధంగా తాజాగా జొస్ బట్లర్ కోహ్లీపైన వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ… విరాట్ కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. ఇప్పుడు కూడా మేము అతడిని ఎలా ఔట్ చేయాలని అనే విషయంపై డ్రెసింగ్ రూమ్ లో చర్చించుకుంటాం. ఎందుకంటే కోహ్లీ వికెట్ తీయడం అనేది ఓ గొప్ప విషయం. అలాగే కోహ్లీ సాధించిన రికార్డులు.. అతని పరుగులు చూస్తేనే అతను ఏం చేసాడు.. ఇంకా ఏం చేయగలడు అనేది అర్ధం అవుతుంది. కోహ్లీ లాంటి ఆటగాడిని ఇలాంటి రెండు, మూడు ఇన్నింగ్స్ లలో డిసైడ్ చేయకూడదు అని బట్లర్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీని తీసేస్తే బీసీసీఐకే నష్టం.. ఎలా అంటే..?

ఆసియా కప్ పై లంక బోర్డు కీలక ప్రకటన..!

Visitors Are Also Reading