Home » కోహ్లీని తీసేస్తే బీసీసీఐకే నష్టం.. ఎలా అంటే..?

కోహ్లీని తీసేస్తే బీసీసీఐకే నష్టం.. ఎలా అంటే..?

by Azhar
Ad
టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగులు చేయలేకపోతున్నాడు. వరుసగా విఫలం అవుతున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో కోహ్లీ ఉన్నాడు. ఈ పర్యటనకు ముందు ఎనో కొన్ని పరుగులు చేసిన విరాట్.. ఇంగ్లాండ్ లో అయితే పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. మొదట ఆడిన టెస్టు మ్యాచ్ లో ఏ మాత్రం పరుగులు చేయని విరాట్… ఆ తర్వాత టీ20 సిరీస్ లోని చివరి రెండు మ్యాచ్ లలో కూడా అదే ఫామ్ ను కొనసాగించాడు. ఇక నిన్న జరిగిన రెండో వన్డేలో కూడా అంతే. ఇక ఇలా విఫలమవుతున్న విరాట్ ను బీసీసీఐ ఇంకా ఎందుకు జట్టులో ఉంచుతుంది అనే ప్రశ్న పెద్ద ఎత్తున వస్తుంది.
టీం ఇండియా మాజీ ఆటగాళ్లు కూడా ఇదే చర్చను ప్రతి మ్యాచ్ తర్వాత తెర మీదకు తెస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మాంటీ పనెసర్ జవాబు అనేది ఇచ్చాడు. కోహ్లీ ఒక్క మార్కెట్ కావడం వల్లే అతడిని జట్టులో ఉంచుతున్నారు అని పేర్కొన్నాడు. మాంటీ పనెసర్ మాట్లాడుతూ… విరాట్ కోహ్లీని బీసీసీఐ జట్టు నుండి తప్పిస్తే.. ఆబోర్డు బాగా నష్టపోతుంది. అందుకే అతడిని జట్టులో ఉంచుతుంది. ఎందుకంటే.. కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. అతని కోసమే చాల మంది మ్యాచ్ అనేది చూస్తారు. ఒకవేళ విరాట్ జట్టులో లేకపోతే వారు మ్యాచ్ చూడరు.
అలా అయితే ఈ ఎఫెక్ట్ అనేది వ్యూవర్ షిప్ మీద పడుతుంది. అది స్పాన్సర్లను ఎఫెక్ట్ చేస్తుంది. ఆ కారణంగానే కోహ్లీని ఇంకా జట్టులో ఉంచుతున్నారు. ఇది అచ్చం ఫుట్ బాల్ లో క్రిస్టియానో రోనాల్డో మాదిరి. అతను జట్టులో ఉంటేనే ప్రేక్షకులు గాని… స్పాన్సర్లు గాని ఎక్కువ వస్తారు. అతను లోక్పాపోతే లేదు. కోహ్లీ విషయంలో కూడా అంతే. స్పాన్సర్లు ఎఫెక్ట్ కాకూడదు అనే ఒక్కే ఒక్క ఉద్దేశ్యంతో బీసీసీఐ కోహ్లీని జట్టులో ఉంచుతుంది. అతను ఇప్పుడు క్రికెట్ లో అందరికంటే పెద్ద మార్కెట్. కోహ్లీ వల్ల మిగితా జట్ల బోర్డులు కూడా బాగానే లాభపడ్డాయి. ప్రస్తుతానికి అయితే కోహ్లీని జట్టులో ఉంచడానికి ఇదే కారణం కనిపిస్తుంది మాంటీ పనెసర్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading