Home » వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

by Azhar
Ad

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అని క్రికెట్ బోర్డు కంటే మన బీసీసీఐ ధనిక బోర్డు అని అందరూ ఒప్పుకుంటారు. తాజాగా అమ్ముడైన ఐపీఎల్ రైట్స్ కూడా దానిని నిరూపిస్తాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కంటే మన బీసీసీఐ ఆదాయమే ఎక్కువ. అసలు ఐసీసీకి వచ్చే ఆదాయంలో మన బీసీసీఐదే 70 శాతం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న బోర్డు ఐపీఎల్ ప్రారంభానికి ముందు మాత్రం కొన్ని కష్టాలు పడింది. అప్పటి ఆటగాళ్లకు కూడా సరైన జీతాలు లేవు అనడంలో సందేహాలు లేవు.

Advertisement

అందుకే ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్న బీసీసీఐ మాజీ ఆటగాళ్లకు అలాగే అంపైర్లకు కూడా పెన్షన్స్ ఇస్తుంది. గవర్నమెంట్ జాబ్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా ఎలా వస్తుందో క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత కూడా బీసీసీఐ అలా వారికీతోడుగా నిలుస్తుంది. అయితే ఈ పెన్షన్స్ అందుకునేవారికి బీసీసీఐ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పెన్షన్స్ ను భారీగా పెంచుతున్నం అని ప్రకటించింది. ఈ విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. మాజీ ఆటగాళ్లను, అంపైర్లను ఆదుకోవడం మా పని. ఎందుకంటే వారు అందించిన విశేషమైన సేవల కారణంగానే నేడు బీసీసీఐ ఈ స్థానంలో ఉంది.

Advertisement

అలాగే బీసీసీఐ ఇంత సేవ చేసిన వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్స్ పెంచుతున్నం అని చెప్పడానికి సంతోషిస్తున్న. ప్లేయర్లు, అంపైర్లు కలిపి మొత్తం 900మంది దీని వల్ల లబ్ధి పొందనున్నారు. ఇందులో మొత్తం 75శాతం కంటే ఎక్కువ మందికి పెన్షన్ ను రెండింతలు పెంచుతున్నం అని జై షా తెలిపారు. ఆ పెన్షన్ పెంపులు ఏ రకంగా ఉన్నాయి అంటే… ప్రస్తుతం 15వేల పెన్షన్ వచ్చేవారికి 30వేల పెన్షన్ అందనుంది. ఇక 22,500 వచ్చేవారికి 45,000, 30 వేలు వచ్చేవారికి 52,500, 37,500 వచ్చేవారికి 60వేలు, రూ.50వేలు వచ్చేవారికి 70వేల పెన్షన్ వస్తుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ, రాహుల్ ను అవమానించిన గంభీర్..!

ఇల్లీగల్ ఫీల్డింగ్ అంటే ఏంటి ? ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఎందుకు..?

Visitors Are Also Reading