Home » ఇల్లీగల్ ఫీల్డింగ్ అంటే ఏంటి ? ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఎందుకు..?

ఇల్లీగల్ ఫీల్డింగ్ అంటే ఏంటి ? ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఎందుకు..?

by Azhar
Ad

క్రికెట్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే ఓ అత్యంత జనాదరణ ఉన్న గేమ్. అయితే ఈ ఆటలో ఎంతో మందో గొప్ప ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారు ఈ ఆటను ఈ రేంజ్ కు తీసుకువచ్చారు. అయితే ఈ గేమ్ లో కూడా తెలిసో.. తెలియకో ఆటగాళ్ళు తప్పులు చేస్తుంటారు. అందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) కూడా తన రూల్ బుక్ ప్రకారం శిక్షలు విధిస్తుంటుంది. ఇక బౌలింగ్ జట్టు కానీ.. బ్యాటింగ్ జట్టు కానీ గ్రౌండ్ లో చేసే కొన్ని తప్పులకు ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఇస్తుంది. బౌలింగ్ జట్టు ఫీల్డింగ్ లో ఏమైనా తప్పులు చేస్తే ఈ శిక్షను ఇస్తుండగా.. బ్యాటింగ్ జట్టు ఆటగాళ్లు పిచ్ పై రన్స్ చేస్తే ఈ శిక్ష విదిస్తుంది.

Advertisement

ఇక తాజాగా కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు 3 వన్డేల సిరీస్ ను పాకిస్థాన్ పర్యటనలో భాగంగా అక్కడ జట్టుతో తలపడింది. అయితే ఈ సిరీస్ లోని రెండో వన్డే మ్యాచ్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. విండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఈ పని చేసాడు. ఇన్నింగ్స్ 28 ఓవర్ లో కీపర్ వేసుకునే గ్లవ్జ్ వేసుకొని ఫిల్డింగ్ చేసాడు. దాంతో ఈ విషయాన్ని చుసిన ఎంపైర్లు వెంటనే ఆటను నిలిపి బాబర్ ను ఆ గ్లవ్జ్ తీసేయాలని సూచించారు. అలాగే ఈ తప్పుకు శిక్షగా విండీస్ జట్టుకు 5 అదనపు పరుగులను కూడా ఇచ్చారు.

Advertisement

దాంతో కెప్టెన్ బాబర్ పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. కనీసం క్రికెట్ రూల్స్ కూడా తెలియని వాడికి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు అని అని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఏమైనా ప్రస్తుతం బాబర్ బ్యాటింగ్ లో మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తూ వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇక ఈ సిరీస్ లో కూడా బాబర్ దుమ్ము దూలపడంతో పాకిస్థాన్ విండీస్ ను 3-0 తేడాతో ఓడించి సిరీస్ క్లిన్ స్వీప్ చేసింది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ, రాహుల్ ను అవమానించిన గంభీర్..!

వైజాగ్ బీచ్ లో భారత ఆటగాళ్ల సందడి..!

Visitors Are Also Reading