Home » సోగ్గాళ్ళ జోరు మామూలుగా లేదు…దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో “బంగార్రాజు”…!

సోగ్గాళ్ళ జోరు మామూలుగా లేదు…దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో “బంగార్రాజు”…!

by AJAY
Ad

అక్కినేని నాగార్జున యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా ఈ సినిమాలో మాత్రం నాగచైతన్య కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. బంగార్రాజు టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనే క్యాప్షన్ ఇచ్చారు.

Bangarraju teaser

Bangarraju teaser

ఈ సినిమాలో నాగచైతన్య కు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా సినిమాలో రమ్యకృష్ణ నాగార్జునకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

Advertisement

Advertisement

Also read : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సుధీర్ గాలోడు టీజర్…హైలెట్స్ ఇవే..!

అన్నపూర్ణ స్టూడియోస్, జి స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్టు కనిపిస్తోంది. కమర్షియల్ హంగులతో సినిమా టీజర్ ఉండటం తో ఈ చిత్రం పై అంచనాలు రెట్టింపు చేసింది. అంతే కాకుండా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. త్వరలోనే సినిమా పాటలు మరియు ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

Visitors Are Also Reading