టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా బండ్ల గణేష్ తనను భీమ్లానాయక్ ఆడియో ఫంక్షన్ కు పిలవలేదంటూ త్రివిక్రమ్ ను తిట్టిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఆ వాయిస్ బండ్ల గణేష్ ది కాదని కూడా వార్తలు వచ్చాయి. అయితే అది బండ్ల గణేష్ ఆడియోనా కాదా అన్నది తెలియదు కానీ బండ్ల గణేష్ మాత్రం భీమ్లా నాయక్ ఆడియో ఫంక్షన్ లో కనిపించలేదు.
Advertisement
అంతే కాకుండా త్రివిక్రమ్ స్పీచ్ లేకుండానే భీమ్లానాయక్ ఆడియో ఫంక్షన్ కూడా పూర్తయ్యింది. దాంతో బండ్ల గణేష్ ఆడియో నిజమే అన్న వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బండ్ల గణేష్ మరో వివాదంతో వార్తల్లోకి ఎక్కారు. రీసెంట్ గా చిన్నజీయర్ స్వామి గతంలో సమ్మక్క సారలమ్మలపై చేసిన కామెంట్ల వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
సమ్మక్క సారలమ్మలు దేవుళ్లు కాదని అన్నారు. వాళ్ల చరిత్ర ఏంటంటూ వ్యాఖ్యానించారు. చదువుకున్న వాళ్లు కూడా అక్కడకు వెళుతున్నారు అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉండటంతో చిన్నజీయర్ పై పలువురు ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా చిన్న జీయర్ పాదాలకు పాదాభివందనం చేస్తున్న ఫోటోను నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
ALSO READ : “కాశ్మీరీ ఫైల్స్” పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు ….!
ఈ ఫోటోకు జై శ్రీమన్నారాయణ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దాంతో బండ్ల గణేష్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమ్మక్క సారమ్మలపై కామెంట్లు చేసినవాడికి ఎందుకు అంతలా దండాలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు కాంట్రవర్సీ కోసమే ఈ వేశాలంటూ బండ్ల పై ఫైర్ అవుతున్నారు.
జై శ్రీ మన్నారాయణ 🙏 pic.twitter.com/ybdY9VUpm3
— BANDLA GANESH. (@ganeshbandla) March 19, 2022