నటసింహం నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇప్పటి వరకు వచ్చిన టాక్ షో లకు భిన్నంగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. దేశంలో ప్రసారమవుతున్న రియాల్టీ షోలలోనే నంబర్ వన్ స్థానంలో బాలయ్య టాక్ షో నిలిచింది. ఇప్పటికే ఈ టాక్ షోకు టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేసిన సంగతి తెలిసిందే.
balakrishna unstoppble
రానా, మంచు మోహన్ బాబు, రాజమౌళి, మహేశ్ బాబు ఇలా ఎంతోమంది విచ్చేసి సందడి చేశారు. ఇక తాజాగా సంక్రాంతి సందర్భంగా ప్రసారమైన ఎపిసోడ్ లో టైగర్ టీం పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా బాలయ్య తన వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చోవడం తన వల్ల కాదని ముందే చెప్పాను అని అన్నారు. నేను ఏదో నాలుగు ప్రశ్నలు అడగడం వాళ్లు సమాధానాలు చెప్పడం తనవల్ల కాదు అని చెప్పారు.
Advertisement
Advertisement
vijay dewarakonda balayya
వచ్చిన వారిని ఆడేసుకుంటా అని ముందే కండిషన్ పెట్టా అని తెలిపారు. ఇక షోకు హాజరైన హీరో విజయ్ దేవరకొండను బాలయ్య తాను హీరోగా నటించిన మొదటి సినిమా ఏది అంటూ ప్రశ్నించాడు. దాంతో విజయ్ ఆలోచిస్తుండగా షో చూడ్డానికి వచ్చిన వారిలో ఒకరు తాతమ్మకల అంటూ ఆన్సర్ ఇచ్చారు. దాంతో అన్సర్ చెప్పిన వ్యక్తిని వాడు నా చేతిలో అయిపోయాడు. ఖతం అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ రీసెంట్ గా అఖండ తో సూపర్ హిట్ అందుకున్నారు. తన తర్వాత సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. అంతే కాకుండా అఖండకు సీక్వెల్ కూడా ప్రకటించారు.
also read : Today top 10 news : నేటి ముఖ్యమైన వార్తలు ఇవే…!