Home » అఖండ టీమ్ తో బాలయ్య అన్ స్టాపబుల్…!

అఖండ టీమ్ తో బాలయ్య అన్ స్టాపబుల్…!

by AJAY
Ad

నందమూరి బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2 థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శత్వం వహించగా బాలయ్య కు జోడిగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో బాలయ్య ను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ నటించినలరించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. బాలయ్య బోయపాటి కాంబో అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే ఈ సినిమాలో ఉంది. దాంతో థియేటర్ ల వద్ద అభిమానులు క్యూ కడుతున్నారు.

Advertisement

Balayya unstoppable with akhanda team

Balayya unstoppable with akhanda team

ఇక సినిమా సక్సెస్ తో చిత్ర యూనిట్ ఇప్పటికే సక్సెస్ మీట్ పెట్టింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జరుపుతోంది. ఇదిలా ఉండగా బాలయ్య తన షో తోనే సినిమా ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోకు ఇప్పటివరకు మంచు మోహన్ బాబు,నాని, మహేష్ బాబు, బ్రహ్మానందం గెస్ట్ లు గా వచ్చినట్టు ప్రకటించారు.

Advertisement

Visitors Are Also Reading