Home » ఆహా బాల‌య్య‌..ఒక్క‌దెబ్బకే బోండాం రెండు వ‌క్క‌లు..!

ఆహా బాల‌య్య‌..ఒక్క‌దెబ్బకే బోండాం రెండు వ‌క్క‌లు..!

by AJAY

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలతోపాటు ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ ఎన్బీకే అనే టాక్ షో కు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటివరకు వచ్చిన టాక్ షోల‌లో బాలయ్య టాక్ షో ది బెస్ట్ గా నిలిచింది. ఇక ఈ టాక్ షోలో బాలకృష్ణ ఓవైపు వచ్చిన అతిథులను నుండి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లు రాబ‌డుతూనే కావాల్సింత వినోదాన్ని ప్రేక్ష‌కుల‌కు ఇస్తున్నారు.

balayya unstopble

balayya unstopble

బాలయ్య టాక్ షో కావడంతో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు టాక్ షోలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షోకు మహేష్ బాబు, అల్లు అర్జున్, మోహన్ బాబు స‌హా మరికొందరు సెల‌బ్రెటీ ప్రముఖులు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా లైగ‌ర్ టీం తో కలిసి బాల‌య్య టాక్ షోలో సంద‌డి చేశారు. విజయ్ తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మాత చార్మి షోకు రాగా బాలయ్య వారందరికీ తాగాల‌ని కొబ్బరి బొండం ఇచ్చారు.

కొబ్బరి బొండం మరెవరో కాకుండా బాలయ్యే స్వయంగా వేట కొడవలితో కొట్టి ఇచ్చారు. ఒక్క దెబ్బకే బాలయ్య వేట కొడవలితో కొబ్బరిబోండం తీశారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బాలయ్య కత్తి ని పైకి ఎగ‌రేసి మళ్లీ చేతితో అందుకున్నారు.

Balakrishna

Balakrishna

ఇక చార్మి మాట్లాడుతూ బ్యాంకాక్ లో కొబ్బరి బొండం ఇలాగే తీసి అందులో వొడ్కా పోసి అమ్ముతార‌ని వ్యాఖ్యానించింది. దాంతో బాలయ్య అలాంటివెన్నో చూసాకే ఇక్క‌డికి వచ్చాను అంటూ పంచ్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. బాలయ్య ఎన‌ర్జీ చూసి నెటిజ‌న్లు కూడా షాక్ అవుతున్నారు.

Visitors Are Also Reading