Home » ఆన్లైన్ టికెట్ల పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

ఆన్లైన్ టికెట్ల పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

by Bunty
Ad

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ సందర్భంగా  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ..  అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిందని.. సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నామని పేర్కొన్నారు హీరో నందమూరి బాలయ్య. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం సంతోషం గా ఉందని.. నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు..ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమా అఖండ అని కొనియాడారు బాలయ్య.

Advertisement

Advertisement

సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి క్రుతగ్నతలని.. ఏదైన పని తలపెడితే విజయం తద్యం అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుందని వెల్లడించారు. మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారన్నారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేసామని పేర్కొన్నారు. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్పెప్ వేశాం కొంతమంది ఆగినా మేమెక్కడా వెనుకడుగు వేయలేదని.. ప్రభుత్వం అప్పీల్ కు వెల్తామంటున్నారు చూద్దామని వెల్లడించారు.

న్యాయ నిర్ణేత దేవుడే దేవుడున్నాడని.. మంచి కధ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తామని తెలిపారు. చిత్రం విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చిందని.. అఖండ సినిమా విజయం తో మిగతా వారికి ధైర్యం వచ్చింది.. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై నా వంతుగా నేను గతంలో మాట్లాడానని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.. ప్రభుత్వం అప్పీల్ కు వెల్తానంటుంది.. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి దాని బట్టి స్పందిస్తానని పేర్కొన్నారు.

Visitors Are Also Reading